Home తాజా వార్తలు ప్రజా తీర్పును స్వాగతిస్తున్నాం: రాహుల్

ప్రజా తీర్పును స్వాగతిస్తున్నాం: రాహుల్

RAHUL-GANDHI

న్యూఢిల్లీ: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా తీర్పును శిరసావహిస్తున్నామని జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల్లో ఏర్పాటు కాబోతున్న కొత్త ప్రభుత్వాలకు ఆయన అభినందనలు తెలిపారు. నా పట్ల హృదయపూర్వంగా చూపించిన ప్రేమ, అభిమానాలకుగాను గుజరాత్, హిమాచల్ ప్రజలకు ధన్యవాదాలన్నారు. అంతకుముందు తల్లి సోనియాతో కలిసి పార్లమెంట్‌కు హాజరైన రాహుల్ రెండు రాష్ట్రాల ఫలితాలు తమకు సంతృప్తిని కలిగించినట్లు మీడియాతో చెప్పారు. అనంతరం ఫలితాలపై ఆయన ట్వీట్ చేశారు.

The Congress Party accepts the Verdict of the People says Rahul Gandhi.