Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

మహిళా సాధికారతకు నాంది పలికింది కాంగ్రెస్సే

uttam

పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి

మనతెలంగాణ/అమీన్‌పూర్ : సమాజంలో మహిళల సాధికారతకు కాంగ్రెస్ నాంది పలికితే టిఆర్‌ఎస్ మాత్రం మహిళలను అసమానతకు గురిచేస్తుందని తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్‌రెడ్డి అన్నారు. మహిళలను చైతన్యపరచడమే కాంగ్రెస్ మూల సిద్ధాంతమని, అందుకు అనుగుణంగా కాంగ్రెస్ పాలన కొనసాగించిందని ఆయన పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో జిల్లా సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు కాట శ్రీనివాస్, ఎంపిటిసి సుధారిణి ఆధ్వరంలో చేపట్టిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పిసిసి చీఫ్ ఉత్తం కుమార్‌రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ, మాజీ మంత్రి డి.కె.ఆరుణతో పాటు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నేరెళ్ల శారద పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం మహిళల పట్ల చూపిస్తున్న వివక్షతపై నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షమేరకు నాడు సోనియాగాంధి, మీరా కూమార్ కృషి చేయబట్టే నేడు ప్రత్యేక రాష్ట్రం అవిర్భవించిందన్నారు. లేదంటే కెసిఆర్ జేజెమ్మలు దిగివచ్చినా తెలంగాణ వచ్చేదా అని మండిపడ్డారు. మోసపూరిత మాటలతో అధికారంలోకి వచ్చిన కెసిఆర్ నాటి నుండి నేటి వరకు అబద్ధాలతోనే కాలం గడిపేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాడన్నారు. 2019లో తిరిగి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని, వచ్చిన వెంటనే రాష్ట్రంలోని ఆరు లక్షల సంఘాలకు ప్రతి మహిళా సంఘానికి పది లక్షల చొప్పున వడ్డీ లేని రుణం ఇస్తామని, లక్షల రూపాయల చొప్పున రివాల్వింగ్ ఫండ్ అందిస్తామని, అభయ హస్తం పథకాన్ని పునరుద్ధరించి రూ.500 నుండి వెయ్యి రూపాయలకు పెంచుతామన్నారు. మహిళా సంఘాల ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని, 1800 మంది విఎఒలకు 3000 వేల నుండి పదివేల వేతనం పెంచుతామని పిసిసి చీఫ్ ఉత్తం కుమార్‌రెడ్డి హామీనిచ్చారు.
అభయ హస్తం ప్రజల హక్కు
పింఛను వయో పరిమితి 60 ఏళ్ల నుండి 65 ఏళ్లకు పెంచి వృద్ధుల జీవితాలలో ఆడుకుంటున్నారని, కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన పింఛను సొమ్మును మిషన్ భగీరథ పనులకు తరలించి కమీషన్ల మత్తులో జోగుతున్నాడని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ ఆరోపించారు. అభయ హస్తం ప్రజల హక్కని, అభయ హస్తం నుండి వచ్చిన రూ.960 కోట్ల ప్రజల సొమ్ము ఏమైందని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 2004 వైఎస్ వచ్చాకే మహిళలు ఆర్థిక సాధికారిత సాధించారని, నాలుగేళ్లలో మహిళా సంఘాలు అస్తవ్యస్థంగా మారాయన్నారు. స్త్రీ శక్తి నిధి బ్యాకు మహిళ చేతుల్లో లేదని మైక్రో ఫైనాన్స్ కంటే అధ్వానంగా తయారయిందని ఆయన దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలోజిల్లా మహిళా అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి, పద్మిని రాజనర్సింహా, బెల్లయ్య, శ్రవన్, రాధిక సురెందర్‌రెడ్డి, స్థానిక కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments