Search
Wednesday 26 September 2018
  • :
  • :

రాజ్యాంగ ధర్మాసనం

ind

సిజెఐ అభిశంసన నిరాకరణపై రాజ్యాంగ ధర్మాసనం 

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాపై తీసుకొచ్చిన అభిశంసన నోటీసు ను రాజ్యసభ చైర్మన్ తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు రాజ్యసభ సభ్యులు దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. న్యా యమూర్తులు ఎస్‌ఎ బోబ్డే, ఎకె సిక్రీ, ఎన్‌వి రమణ, అరుణ్ మిశ్రా, ఆదర్శ్ కుమార్ గోయెల్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉదయం పదిన్నర గంటలకు ఈ పిటిషన్‌ను విచారిస్తుంది. సోమవారం జస్టిస్ చలమేశ్వర్ ముందు ఈ అం శం ప్రస్తావనకు వచ్చిన తర్వాత ఈ ఆకస్మిక నిర్ణ యం తీసుకున్నారు. మిశ్రా అభిశంసన నోటీసు ను తిరస్కరించడం చట్టవ్యతిరేకమని, రాజ్యసభ చైర్మన్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తూ పంజాబ్‌కు చెందిన ప్రతాప్ సింగ్ బాజ్వా, గుజరాత్‌కు చెందిన అమీ హర్షద్‌రే యాజ్ఞిక్‌లు ఈ పిటిషన్ దాఖలు చేశారు. అభిశంసన నోటీసు పై సంతకం చేసిన వారిలో ఒకరైన సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ ఈ పిటిషన్‌పై తక్షణం విచారణ చేపట్టాలని జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నేతృత్వంలోని బెంచ్‌ముందు ప్రస్తావించారు. అయితే రోస్టర్ విధానం ప్రకారం ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్ ముందు ప్రస్తావించాలని జస్టిస్ ఎస్‌కె కౌల్ కూడా ఉన్న బెంచ్ సిబల్‌కు, మరో సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌లకు సూచించింది. రోస్టర్ విధానంసై రాజ్యాంగ ధర్మాసనం తీర్పుగురించి తనకు తెలుసునని, అయితే ఇది ప్రధాన న్యాయమూర్తి అభిశంసనకు సంబంధించిన పిటిషన్ అయినందున ఆయన నేతృత్వంలోని బెంచ్ ముందు ప్రస్తావించలేమని సిబల్ బెంచ్‌కి తెలియజేశారు. అనంతరం ఇరువురు జడ్జీలు పరస్పరం కొంతసేపు సమాలోచనలు జరిపిన తర్వాత దీనిపై మంగళవారం నిర్ణయం తీసుకుంటానని బెంచ్‌కి నేతృత్వం వహిస్తున్న చలమేశ్వర్ తెలిపారు. అయి తే చలమేశ్వర్ నిర్ణయం తీసుకోవడానికి ముందే ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడంగమనార్హం. ధర్మాసనంలో సుప్రీంకోర్టులోచీఫ్ జప్టిస్ తర్వాత సీనియర్‌మోస్ట్ న్యాయమూర్తులయిన జాస్తి చలమేశ్వర్, రంజన్ గొగోయ్, మదన్ బి లోకూర్, కురియన్ జోసెఫ్‌లలో ఏ ఒక్కరుకూడా లేకపోవడం విశేషం. ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా పనితీరుపై తొలిసారిగా ఈ నలుగురు జడ్జీలు మీడియా సమావేశంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం తెలిసిందే. జస్టిస్ దీపక్ మిశ్రాను భారత ప్రధాన న్యాయమూర్తిగా తొలగించాలని కోరుతూ రాజ్యసభలో కాంగ్రెస్ నేతృత్వంలో ఏడు ప్రతిపక్ష పార్టీ లు నోటీసు ఇవ్వడం తెలిసిందే. 64మంది రాజ్యసభ సభ్యులు ఈ నోటీసుపై సంతకాలు చేసి రాజ్యసభ చైర్మన్ అయిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి అందజేశారు.అయితే వెంకయ్యనాయుడు దీన్ని తిరస్కరించారు.జస్టిస్ దీపక్ మిశ్రా పై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని ఆ సందర్భంగా వెంకయ్యనాయుడు అన్నారు. నోటీసులో ఎలాంటి పస లేదని, అందులోని ఆరోపణలు సమర్థనీయమైనవి కావని ఆయన అఖిప్రాయపడ్డారు.అయితే వెంకయ్యనాయుడి నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. అభిశంసన నోటీసును ప్రాథమిక స్థాయిలోనే తిరస్కరించడం ఎంతమాత్రం సరికాదని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తామని అప్పుడే ప్రకటించింది కూడా.

Comments

comments