Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

అధికారుల గైర్హాజరుతో మండిపడ్డ జెడ్పీ స్టాండింగ్ సమావేశం

The contractors supply inferior goods must be removed

బాధ్యతలు విస్మరించిన అధికారులపై  చర్యలు తీసుకోవాలని సభ్యుల డిమాండ్
నాసిరకం వస్తువులను సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లను తొలగించాలి
సమావేశాలకు సభ్యులను విస్మరిస్తే సహించేది లేదు : జెడ్పీ చైర్మన్ తుల ఉమ

మన తెలంగాణ/కరీంనగర్: జిల్లా స్థాయి అధికారులు గైర్హాజరు కావడంతో బుధవారం నిర్వహించిన జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ సమావేశం తీవ్రంగా మండిపడింది. జెడ్పీ చైర్మన్ అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశానికి కిందిస్థాయి అధికారులు మినహా జిల్లా స్థాయి అధికారులు హాజరుకాకపోవడంతో జెడ్పీటీసి అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారానికి ఏవరూ జవాబుదారీగా వ్యవహారిస్తారని ప్రశ్నించారు. చాలా సమావేశాలకు జిల్లా స్థాయి అధికారులు హాజరుకావడం లేదని పేర్కొంటూ ఈ పరిస్థితి ఇదేవిధంగా కొనసాగితే తాము సమావేశాలకు హాజరైనా ఏలాంటి ఫలితం ఉండదని వారు అసహనం వ్యక్తం చేశారు. సమావేశం ఉందని తెలిసినా నిర్లక్షంగా గైర్హాజరైన అధికారుల మీద చర్యలు తీసుకోవాలని జెడ్పీటీసి సభ్యుడు డిమాండ్ చేశారు. అంతేకాకుండా జెడ్పీటీసి సభ్యులను అధికారులు పట్టించుకోవడం లేదని మండలంలో ఏ కార్యక్రమం జరిగినా తమకు సమాచారం ఉండటం లేదని మల్యాల జెడ్పీటీసి సభ్యురాలు శోభరాణి సభ దృష్టికి తీసుకురాగా జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ మాట్లాడుతూ మండలంలో జరిగే ఏలాంటి అభివృద్ది కార్యక్రమాలైన ముందుగా జెడ్పీటీసి సభ్యులు సహా ఎంపిపిలకు సమాచారం అందించాలని వారికి తెలియజేయని పక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇటీవలి కాలంలో ఈ పరిస్థితి ఓ సంప్రదాయంగా కొనసాగుతుందని ప్రోటోకాల్‌ను విస్మరిస్తే సహించేది లేదని ఆమె ఆగ్రహాం వ్యక్తం చేశారు. మహిళల సమస్యలకు పరిష్కారం చూపేందుకు సఖి అనే ఒక సంస్థ పనిచేస్తుందనే విషయమే తనకు తెలియదని మండలంలో తనకు తెలియకుండా వారు ఆవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని జెడ్పీటీసి శోభారాణి తెలియజేయగా భవిష్యత్తులో ఏలాంటి కార్యక్రమం చేపట్టిన ఆ మండల జెడ్పీటీసిలకు తప్పకుండా తెలియజేస్తామని సఖి బాధ్యులు పేర్కొన్నారు. అదేవిధంగా మండలంలో గర్భిణీలకు, బాలింతలకు అందించే పౌష్టికారహాంలో భాగంగా ఇచ్చేటువంటి పాల ప్యాకెట్ల పూర్తిగా చెడిపోయినవి ఇస్తున్నారని సదరు కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలని శోభారాణి డిమాండ్ చేయగా ఇకనుండి ఈ పరిస్థితి ఎదురుకాకుండా చూస్తామని అధికారులు తెలిపారు. అన్నపూర్ణ పథకం కింద ప్రభుత్వం పేదలకు అందించే 10 కిలోల బియ్యం తమ మండలంలోని చాలా గ్రామాల ప్రజలకు అందడం లేదని గంభీరావుపేట జెడ్పీటీసి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగి ఉన్న ఇంట్లో రేషన్ డీలర్‌షిప్ ఏలా ఇచ్చారంటూ మానకొండూర్ జెడ్పీటీసి సుగుణాకర్ ప్రశ్నించారు. పైగా అతను రేషన్ వస్తువులను ఎస్.సి కమ్యూనిటీ హాల్‌లో పెట్టుకుని పంపిణీ చేస్తున్నాడని తెలిపారు. కాటారం మండంలోని దువ్వాడలో రేషన్‌డీలర్ లేడని వెంటనే రేషన్‌డీలర్‌ను ఏర్పాటు చేయాలని జెడ్పీటీసి చల్లా నారాయణరెడ్డి కోరారు.
అదేవిధంగా ఇంకుడు గుంతలకు సంబంధించిన బిల్లులు నేటికి కూడా రాలేదని పేర్కొన్నారు. మల్యాలలోని ఎస్.సి హాస్టల్‌లో వార్డెన్ అందుబాటులో ఉండటం లేదని దీంతో హాస్టల్ ఉండే బాలికలకు రక్షణ లేకుండా ఉందన్నారు. వెంటనే శాశ్వతంగా ఉండేటువంటి వార్డెన్‌ను నియమించాలని అన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో మహిళా ప్రగతి ప్రాంగణాన్ని ఏర్పాటు చేసేందుకు 5 నుండి 10 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి అధికారులకు తెలియజేయాలని స్థానిక జెడ్పీటీసికి సూచించారు. అదేవిధంగా సంక్షేమ హాస్టళ్ళను పటిష్టంగా నిర్వహించాలని ముఖ్యంగా బాలికల హాస్టళ్ళలో వార్డెన్‌లు స్థానికంగా ఉంటూ అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ సమావేశంలో జెడ్పీటీసిలు కందుల సంధ్యారాణి, శ్రీనివాస్, జెడ్పీ కోఅప్షన్ సభ్యుడు జమీల్, మరికొందరు మహిళా జెడ్పీటీసిలు సహా జిల్లా పరిషత్ సి.ఇ.వో పద్మజారాణి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments