Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

కార్పొరేటుకు దీటుగా సర్కారు పాఠశాలల్లో విద్య

corporates Counter government educated in schools

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి

మన తెలంగాణ/సదాశివనగర్: సర్కారు బడులను బలోపేతం చేయాలని రాష్ట్ర వ్యాప్తం గా అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి టిఆర్‌ఎస్ సర్కారు కృషి చేస్తుందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా లింగంపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో వంటశాల గది, గ్రంథాలయమును ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా ఉపాధ్యాయులు సర్కారు బడులలో విద్యార్థులను చేర్చుతూ బడులను బలోపేతం చేస్తున్నారన్నారు. అంతేకాకుండా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ వారి అభివృద్ధికి, బంగారు భవిష్యత్తుకు బాట వేస్తున్నారని అభినందించారు. పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలను వినియోగించుకుంటూ తమ విద్యాభ్యాసాన్ని కొనసాగించడం హర్షనీయమన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్యాబోధన కొనసాగించడం హర్షనీయమన్నారు. ఫలితంగా ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల మీద అన్ని వర్గాల ప్రజలకు నమ్మకం ఏర్పడిందన్నారు. పాఠశాల బలోపేతానికి గ్రామ సర్పంచ్ చందర్‌రావు, గ్రామస్తులు, ప్రధానోపాధ్యాయుడు సాయిలు విశేష కృషి చేస్తున్నారని అభినందించారు. ఫలితంగా గతంలో 60 మంది విద్యార్థులు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 221కి చేరుకోవడమే నిదర్శమన్నారు.

పలు అభివృద్ధి పనులు ప్రారంభం
లింగంపల్లి గ్రామంలో దాదాపు 20 లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. గ్రామంలో ప్రతి వీధివీధికి మరో 25 లక్షలు కేటాయించి రోడ్డు వేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం గ్రామంలోని శ్రీకృష్ణ మం దిర్‌లో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి బంజ విజయ, సర్పంచ్ పెద్దబీర చందర్‌రావు, జెడ్పిటిసి పడిగెల రాజేశ్వర్‌రావు, వైస్ ఎంపిపి రూపేందర్ రెడ్డి, సిడిసి చైర్మన్ నారెడ్డి లింగారెడ్డి, పాఠశాల ఎస్‌ఎంసి అధ్యక్షుడు బాలకిషన్, ఉపసర్పంచ్ గంగారాం, ఎంపిడివో విజయ్ కుమార్, టిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గడిల భాస్కర్, గ్రామ కమిటి టిఆర్‌ఎస్ అధ్యక్షుడు చందర్‌రావు, మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, ఈజిఎస్ ఎపిఓ శృతి, టిఎ సంతోష్, ఈసి రాధిక, గంగారెడ్డి, కిషన్, సురేష్, రాములు, లింగం, అంగన్‌వాడి టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

comments