Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

సామాజిక న్యాయం కోసమే సిపిఐ పోరాటం

cpi1

మన తెలంగాణ/నర్సింహులపేట : సామాజిక న్యాయం రాష్ట్ర సమాగ్రాభివృద్ధి కోసం అన్ని కుల, ప్రజా సంఘాలు ఐక్యంగా పోరాడాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నల్లు సుధాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలోని చౌరస్తాలో సీపీఐ 92వ వార్షికోత్సవాలను పురష్కరించుకోని ఆయన కార్యకర్తలతో కలసి సీసీఐ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూస్వామ్య, బూర్జవ విధానలపై, పోరాడుతూ అసమానతలు లేని సామాజం కోసమే సీపీఐ ఆవిర్భవించిందని ఆయన అన్నారు. పేదలకు అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సీసీఐ పార్టీ నిత్యం పేదల మద్య ఉంటూ పోరాడుతుందని ఆయన అన్నారు. నాటి స్వాతంత్య్ర సంగ్రామంలోని, నేటి వరకు పాలక వర్గాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశీల ఉద్యమాలు సాగిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కౌన్సీల్ సభ్యుడు నెమ్మది రామలింగం, నాయకులు కొమిరె యాకన్న, నర్సయ్య, వెంకన్న, బాబురావు, తదితర కర్యకర్తలు పాల్గొన్నారు.

Comments

comments