Home జాతీయ వార్తలు రేపిస్టులకు మరణశిక్షే…

రేపిస్టులకు మరణశిక్షే…

Criminal-Law-Amendment-Bill

న్యూఢిల్లీ: ఇవాళ నేర చట్ట సవరణ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టారు. కొత్త చట్టం ప్రకారం.. 12ఏళ్ల లోపు బాలికను అత్యాచారం చేస్తే.. దోషికి కనీసం 20 సంవత్సరాల జైలు శిక్ష లేదా మరణ శిక్షను ఖరారు చేస్తారు.  16 సంవత్సరాల లోపు అమ్మాయిని అత్యాచారం చేస్తే.. దోషికి 10 నుంచి 20 సంవత్సరాల వరకు శిక్షను వేస్తారు. దీన్ని ఆ తర్వాత జీవిత ఖైదుగా కూడా పొడిగించవచ్చు. మహిళలను అత్యాచారం చేస్తే వారికి కఠినంగా 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు పెంచారు.  16 సంవత్సరాల లోపు అమ్మాయిని అత్యాచారం చేసినా, గ్యాంగ్ రేప్ చేసినా.. నిందితులకు బెయిల్ ఇవ్వరు. అత్యాచార కేసులను వేగంగా పరిష్కరించాలని, రెండు నెలల్లోనే కేసును తేల్చాలని కొత్త చట్టంలో చేర్చారు. బిల్లుపై ఆర్జేడీ ఎంపి రంజీత్ రంజన్ ఆవేధనతో మాట్లాడారు. రేప్ కేసుల్లో నిందితులకు మరణశిక్షే వేయాలని ఓ తల్లిగా ఆమె  ఆకాంక్షిస్తున్నానన్నారు.