Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

కాంగ్రెస్‌ను విమర్శిస్తే సహించేది లేదు

The criticism of the Congress is not tolerated

మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్

మనతెలంగాణ/కరీంనగర్‌: సుధీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని, పార్టీ నాయకులకు విమర్శిస్తే సహించేది లేదని కరీంనగర్ మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. సోమవారం నగరంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహాంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ సభ్యుడు బోయినిపల్లి వినోద్‌కుమార్ అవాకులు చెవాకులు పేలుతున్నాడని నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన మూ ల్యం చెల్లించకతప్పదని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా గురించి కె.సి.ఆర్ ప్రస్తావించిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. కెసిఆర్ అడిగితే తప్పులేదు కాని ప్రత్యే క హోదా విషయంలో బిజెపి ప్రభుత్వం మాట తప్పితే తాము ప్రశ్నిస్తే తప్పువచ్చిందా అ ని అన్నారు.ప్రత్యేక హోదా వలన పరిశ్రమల ఏర్పాటుకు అంతరాయం కలుగుతుందని దీని వలన తెలంగాణకు నష్టం వాటిల్లుతుందనడం అవాస్తవమని పేర్కొన్నారు.అర్ధరహితమైన వినోద్‌కుమార్ వాఖ్యలు ఉపసంహరించుకోవాలని అన్నారు.కాంగ్రెస్ పార్టీ నిర్మించిన వేదికను టిఆర్‌ఎస్ వాడుకుంటుందన్నారు.
రాష్ట్రంలో కుటుంబపాలన నడుస్తుందని రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోనికి తీసుకువెళ్ళిన ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణను బంగారు తెలంగాణగా మారుస్తానని చెప్పడం హా స్యాస్పదంగా ఉందన్నారు.దళితులకు మూడెకరాల భూమిని ఇస్తామని నమ్మించిన కె సిఆర్ అధికారంలోనికి వచ్చిన తరువాత ఆ మాటే మరిచారని ఫలితంగా కె.సి.ఆర్ మీద దళితులు నిప్పులు చెరుగుతున్నారని అన్నారు. ఉద్యోగాల కల్పన విషయంలో నిరుద్యోగులకు మొండిచెయ్యి చూపిన ప్రభుత్వం మీద వారు కూడా ఆగ్రహాంతో ఉన్నారని ఏవరైనా టి.ఆర్.ఎస్ నాయకులు గ్రామాలకు వస్తే తరిమికొట్టే పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాను ముక్కలు చేసి అభివృద్ధి జరగకుండా నాశనం చేసిన కెసిఆర్‌కు తగిన గుణపాఠం చెప్పేందుకు కరీంనగర్‌వాసులు సిద్ధంగా ఉన్నారని మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కర్ర రాజశేఖర్, మాజీ మేయర్ డి.శంకర్, నాయకులు చాడగొండ బుచ్చిరెడ్డి, ఆకు ల ప్రకాశ్, దేశ వేదం తదితరులు పాల్గొన్నారు

Comments

comments