Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

యాదాద్రిలో భక్తుల రద్దీ

god2* మొక్కులు తీర్చుకున్న భక్తులు
* 16.97 లక్షల ఆదాయం

మనతెలంగాణ/యాదాద్రి : శ్రీ లక్ష్మినరసింహ స్వా మి యాదాద్రి క్షేత్రంలో స్వామి వారి దర్శనార్ధం తరలి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. శ్రీ రామనవ మి, సెలవు దినం కావడంతో ఆదివారం రోజున స్వా మి వారి దరశనార్థం వచ్చిన భక్తులతో యాదాద్రి కొ ం డ కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుండి స్వామి వారిని దర్శించుకొనుటకు తరలి వచ్చిన భక్తులతో యాదాద్రి కొండతో పాటు పట్టణంలో రద్దీ నెలకొంది. తెల్లవారు జామునుండే స్వామి వారి దర్శనార్ధం భక్తు లు తరలి వెళ్ళి పుష్కరణిలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామి వారిని దర్శించుకోగా మొక్కుబడులు చెల్లించుకునే భక్తులు కొండపై జరుగు శ్రీ వారి అభిషేక, అర్చ న, కల్యాణ మహోత్సవం, సత్యనారాయణ వ్రత పూ జలు, పుష్పార్చన, శేవ కార్యక్రమాల్లో భక్తులు పా ల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారి దర్శనార్ధం తరలి వచ్చిన భక్తుల రద్దీ అధికంగా ఉండ టం వల్ల సాధారణ దర్శన క్యూలైన్లో సుమారు 3 గంటలకు పైగా భక్తులు వేచి ఉండక తప్పలేదు.
శ్రీవారి నిత్యరాబడి : శ్రీలక్ష్మినరసింహా స్వామివారి దేవస్థానం స్వామివారి నిత్యరాబడిలో భాగంగా ఆదివారం రోజున 16 లక్షల 97 వేల 571 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికా రి తెలిపారు. ప్రధాన బుకింగ్, శ్రీఘ్రదర్శనం, వ్రతా లు, కళ్యాణ కట్ట, ఎంక్వైరీ, ప్రసాదాలు, వాహన పూ జల శాఖల ఆదాయం వచ్చినట్లు తెలిపారు.

Comments

comments