Home తాజా వార్తలు హరిత దీక్షకు సిద్ధం

హరిత దీక్షకు సిద్ధం

haritha

త్వరలో భూపాలపల్లి నుంచి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించనున్న
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు

మన తెలంగాణ / హైదరాబాద్: రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 4వ విడత హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రారంభిస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా॥ ఎస్‌కె.జోషి తెలిపారు. జయశంకర్ భూపాలపల్లిలో కార్యక్రమాన్ని సిఎం లాంఛనంగా ప్రారంభిస్తాన్నారన్నారు. త్వరలోనే ప్రారంభం కానున్న హరితహారానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. హరితహారంతో పాటు ధరణి ప్రాజెక్టు, స్వచ్ఛ భారత్, భూ సేకరణ అంశాలపై మంగళవారం సిఎస్ సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ హరితహారాన్ని ప్రజా కార్యక్రమంగా నిర్వహించాలని, అన్ని వర్గాల ప్రజలు, ప్రజాప్రతినిధులు భాగస్వాములయ్యేలా చూడాలన్నారు. పెద్ద ఎత్తున పాఠశాల విద్యార్థులు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. హరితహారం సన్నద్ధతపై వివిధ జిల్లాల కలెక్టర్లతో సమీక్షించిన సిఎస్ వచ్చే ఏడాదికి సంబంధించి వంద కోట్ల మొక్కల లక్షాన్ని సిఎం నిర్దేశించారని తెలిపారు. దీనికనుగుణంగా ప్రతి గ్రామంతో పాటు ప్రతి మున్సిపాలిటీ, కార్పొరేషన్‌లోని ప్రతి వార్డులో నర్సరీలను ఏర్పాటు చేయడంతో పాటు వీటికోసం అవసరమైన స్థలాలను గుర్తించాలన్నారు.హరితహారం ఉపయోగాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు కార్యక్రమం పట్ల వారిలో ఆసక్తిని పెంచేందుకు ప్రతి చోట వ్యాసరచన, ఉపన్యాస పపోటీలను నిర్వహించాలని సిఎస్ జోషి సూచించారు. విద్యార్థికి ఐదు మొక్కల చొప్పున ఇచ్చి వాటి పెంపు బాధ్యతను అప్పగించాలన్నారు. విద్యార్థులకిచ్చే మొక్క ల్లో పూలు, పండ్లు, డనివచ్చేవి ఉండాలన్నారు. అలాగే పర్యావరణం, హరితహారం ప్రాధాన్యత పై సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో కళాజాతాల ద్వారా ప్రచారం చేయడం, కవి సమ్మేళనాలను విసృత్తంగా నిర్వహించాలన్నారు. వర్షాలు స మృద్ధిగా కురుస్తున్న జిల్లాల్లో వాటిని సద్వినియో గం చేసుకొని ఇప్పటికే ఏర్పాటు చేసుకున్న చోట్ల మొక్కలు నాటాలని సిఎం ఆదేశించినట్లు చెప్పా రు. వర్షాలకు విరామమొచ్చి మొక్కలకు నీరు అందని పరిస్థితి తలెత్తితే అవసరాన్ని బట్టి ట్యాం కర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలన్నారు. ఇందుకోసం ఉపాధి హామి నిధులను అనుసంధానం చేస్తామన్నారు. రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి అధికారుల వరకు నిర్వహిస్తున్న శిక్షణ పూర్తి చివరకు చేరిందని, ఈ పరిజ్ఞానంతో మరింత సమర్థవంతంగా నాటిన మొక్కల పర్యవేక్షణ ఉండాలన్నారు. అటవీ మొక్కలకు ప్రాధాన్యనిస్తూ కోతులు, ఇతర జంతువులు తినే పండ్ల జాతులను విసృత్తంగా నాటించాలన్నారు.హరితహారంలో భాగంగా స్మృతి వనాల ఏర్పాటుకు అత్యధిక ప్రాధాన్యనివ్వాలని సిఎస్ సూచించారు. చనిపోయిన వారి పేర్లతో ఆత్మీయులు మొక్కలు నాటించి వాటి సంరక్షణ బాధ్యతను ఆ కుటుంబం తీసుకునేలా ప్రోత్సాహిస్తే మంచి ఫలితాలు రాబట్టవచ్చన్నారు.
డిజిటల్ సిగ్నేచర్ పనులను వేగవంతం
ధరణి ప్రాజెక్టుపై సిఎస్ ఈ సందర్భంగా సమీక్ష నిర్వహించారు. పాసు పుస్తకాల కోసం డిజిటల్ సిగ్నేచర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. గ్రామాలు, మండలాల వారీ గా సమీక్షిస్తూ లక్షాల మేరకు రోజు వారి పురోగతిని సాధించాలన్నారు. సాంకేతికంగా ఎదురయ్యే సమస్యలను రాష్ట్రస్థాయి అధికారులు పరిష్కరిస్తారని తెలిపారు. మండల, సెంట్రల్ స్థాయి లో పాస్ పుస్తకాల ప్రింటింగ్‌ను వేగవంతం చే యాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. పాస్ పుస్తకాల్లో తప్పుల సవరణ లపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. అక్టోబర్ రెండు నాటికి రాష్ట్రం పూర్తి ఓడిఎఫ్ సాధించాలన్న సిఎం ఆదేశాల మేరకు వ్యక్తిగత మరుగుదోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు. సమయం తక్కువగా ఉన్నందున కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి నిర్మాణాలు పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. కేంద్రం నుంచి నిధులు విడుదల అవుతున్నాయని, మరుగుదోడ్ల నిర్మాణానికి ఉన్న నిధులను వినియోగించుకోవాలని తెలిపారు.