Home మెదక్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా చికిత్సాలయం

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా చికిత్సాలయం

house*పట్టించుకునే నాథుడు లేక పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్న భవనం
*చికిత్స కోసం కుష్టు రోగులు పక్క జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితి

మనతెలంగాణ/మెదక్ ప్రతినిధి: ఉమ్మడి జిల్లాలో ఎక్కడా లేని విధంగా 1987వ సం వత్సరం సెప్టెంబర్ 28వ తేదీన జాతీయ కుష్టు వ్యాధి నివారణ కార్యక్రమం ద్వారా హవేళిఘనపూర్ మండలంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వ హయాంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి కరణం రామచంద్రారావు మెదక్ నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న సమ యంలో ఎన్. శ్రీనివాస్‌రెడ్డి అప్పటి రెవెన్యూ శాఖ మాత్యుల హయాంలో కుష్టు రోగులకు ప్రత్యేకంగా తాత్కాలిక చికిత్సాలయ భవనాన్ని నిర్మించారు. కానీ అది నేడు పూర్తి గా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. పట్టించుకునే వారు లేక పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ఈ భవన నిర్మాణం చేపట్టి ప్రా రంభమయ్యాక సుమారు 20 సంవత్సరాల వరకు ఇక్కడికి వచ్చే కుష్టు రోగులకు చికిత్సలు చేసేవారు. కానీ గత పది సంవత్సరాల నుంచి ఇక్కడ వైద్యాన్ని అందించే వారు లేక పూర్తిగా మూతపడి శిథిలావస్థకు చేరుకుంది. అప్పటి నుంచి ఈ భవనం పూర్తిగా అసాంఘిక కార్యక్రమాలకు నిలయం గా మారిపోయింది. అంతే కాకుండా సంఘ విద్రోహ శక్తులందరూ కూడా ఈ భవనాన్ని వాడుకుంటున్నట్లు హవేళిఘనపూర్ వాస్తవ్యులు తెలుపుతున్నారు. ప్రస్తుతం క్షయ, కుష్టు వ్యాధులకు జిల్లాలో వైద్యం అందించే సదుపాయాలు లేక నేటికి జిల్లా ఏర్పడిన తర్వాత కూడా పక్కజిల్లా సంగారెడ్డికే రోగులు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మెదక్ జిల్లా కేంద్రమైనందున ఇక్కడే మళ్లీ ఈ రోగులకు వైద్యం అందించేందుకు భవనాన్ని పునరుద్దరించాలని, అందువల్ల సుదూర ప్రాంతాలకు వెళ్లి చికిత్స చేసుకునే వ్యాధిగ్రస్తులకు సౌకర్యవంతంగా ఉంటుందని స్థానికులు తెలుపుతున్నారు. ప్రస్తుతం శిథిలావస్థకు చేరిన భవనం పూర్తిగా అన్యాక్రాంతం అయి భవనం వెనుకాలే గల సుమారు ఆరేడు ఎకరాల భూమి కూడా కబ్జాలకు గురవుతుందని తెలుపుతున్నారు. భవనం లోపల వెళ్లి చూస్తే పూర్తిగా చెత్తచెదారంలో నిండి ఉండి, ఖాళీ మధ్యం బాటిల్లు దర్శణం ఇస్తున్నాయని స్థానికులు తెలుపుతున్నారు. ప్రభుత్వం వెంటనే సానుకూలంగా స్పందించి జిల్లా కేంద్రానికి అనువుగా భవనాన్ని పునరుద్ధరించి అన్ని వసతులు మునపటిలాగే కల్పించి చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతానికి అద్దె భవనాలలో ప్రభుత్వ కార్యాలయాలు నడిపిస్తున్న తరుణంలో వృధాగా ఉన్న ఈ యొక్క భవనాన్ని మునుపటిలాగే కుష్టువాధి కేంద్రంగా గానీ లేదా ఇతర ఏ ప్రభుత్వ కార్యాలయానికి గానీ వాడుకోవాలని హవేళిఘనపూర్ ప్రజలు కోరుతున్నారు. సువిశాలంగా ఉన్న గదులతో నిర్మించిన ఈ భవనాన్ని ఇప్పటికైనా ప్రభు త్వం పట్టించుకోకపోతే పూర్తిగా కనుమరుగయ్యే అవకాశముందంటున్నారు. జిల్లా కేంద్రానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ భవనాన్ని ప్రభుత్వం పట్టించుకోక పోవడం శోచనీయమని, ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఈ భవనంలో ప్రభుత్వ సంబంధమైన కార్యాలయంగా తీర్చిదిద్దితే జిల్లా ప్రజలకు కూడా అందుబాటులో ఉండి సౌకర్యవంతంగా ఉంటుందని స్థానికులు తెలుపుతున్నారు. ఇప్పటికే ఈ భవనాన్ని డిటిఓ (డిస్ట్రీక్ట్ రోడ్డు ట్రాన్స్‌పోర్టు) అధికారులు తమకు స్వంత భవనం లేనందునా ఈ భవనాన్ని కేటాయించాలని పలుమార్లు కలెక్టర్‌కు, స్థానిక ఎంఎల్‌ఏ, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డికి విన్నవించుకున్నారు. ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న సువిశాలమైన భవనంలో తమ కార్యాలయాన్ని, వెనుక ఉన్న ఖాళీ స్థలంలో ట్రయల్న్ (లైసెన్సులు జారీ చేయి వారికి పరీక్షలు నిర్వహించేందుకు) అనువుగా ఉంటుందని ప్రతిపాదనలు పంపారు. కానీ ఇప్పటివరకు వారికి ఈ భవనాన్ని కేటాయించక పోవడంతో ప్రస్తుతం అద్దె భవనంలోనే తమ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని డిటిఓ గణేష్‌హజారి తెలుపుతున్నారు.