Home కరీంనగర్ డ్యాం రూపురేఖలు మారుస్తాం

డ్యాం రూపురేఖలు మారుస్తాం

The dam will change the shape

సుందరీకరణకు రూ. 8కోట్లు
సిఎం సహకారంతో అభివృద్ధి
కరీంనగర్ ఎంఎల్‌ఎ గంగుల కమలాకర్

మనతెలంగాణ/కరీంనగర్‌టౌన్: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని లోయ ర్ మానేరు డ్యాంను సుందరంగా తీర్చిదిద్ది రూపురేఖలను మారుస్తామని కరీంనగర్‌ ఎంఎల్‌ఎ గంగుల కమలాకర్ అన్నారు. శనివారం డ్యాం కట్టపై లైటింగ్ కోసం ఆరు కోట్ల డెబ్బై లక్షల రూపాయలను విడుదల చేసి పనులకు నగర మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్,డిప్యూటీ మేయర్ గుగ్గిల్లపు రమేష్‌లతో కలిసి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎం ఎల్‌ఎ మాట్లాడుతూ మానేరు డ్యాంకట్టపై వచ్చే సందర్శకులకు ఆహ్లాదరక వాతావరణాన్ని అందిస్తామన్నారు.వాకింగ్‌కు కూడా ఇబ్బందు లు లేకుండా రోడ్లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. డ్యాంకట్ట అ యిదు కిలోమీటర్ల పొడువున్నప్పటికీ 2.5 కిలోమీటర్ల పొడువుకు మా త్రమే కోటి అరవై లక్షల నిధులతో రోడ్డును వేయడం జరిగిందన్నారు.

మరి కొంత రోడ్డుకు ఆరు కోట్ల డెబ్బై లక్ష లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఇందులోనే లైటింగ్ కుడా వేయడం జరుగుతుందన్నారు. డ్యాం సందర్శనకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందు లు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మొత్తం డ్యాం సుందరీకరణకోసం ప్రభుత్వం ఎనిమిది కోట్లు మంజూరు చే సిందన్నారు.ప్రజలు నీటిలో బోటింగ్ షికారు చేసేందుకు స్కూ టర్ బోట్స్ కూడా తెప్పించడం జరుగుతుందన్నారు. సి.యం. కేసీఆర్ సహకారంతో డ్యాం సుందరీకరణతో పాటు రాత్రిపూట ఎలాం టి ఇబ్బందులు లేకుండా డ్యాం కట్ట చుట్టూ వెలుగులు ఉండేందుకు ఎల్‌ఇడి బల్బులను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అందు లో భాగంగానే నేడు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. ప్రజలందరి సహకారంతోనే అభివృద్ధి జరుగుతుందని, అందరూ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనుల్లో భాగస్వాములు కావాలని కోరారు.కార్యక్రమంలో కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.