Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

గంపెడాశతో గల్ఫ్‌కు… శవపేటికలో ఇంటికి…

The dead body reached home within 32 days

గంభీరావుపేట : ఇక్కడ సరైన పనిలేదాని, భార్యాపిల్లలను పోషించాలంటే సరిపోయేంత కూలీ దొరకడం లేదాని ఓ దినసరి కూలీ అప్పు చేసి గంపెడాశతో కానరాని దేశాలకు వెళ్లాడు. తీరా అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురవడంతో ఇంటికి రావడానికి చేతిలో పైసలు లేక.. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక దినదినం మదనపడుతూ గుండెపోటుకు గురై మృత్యువాత పడిన వలస జీవి మృతదేహం 32 రోజులకు ఇంటికి చేరడంతో కుటుంబంలో విషాదం అలముకుంది. వివరాల్లోకి వెళ్లితే గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన దీటి దేవయ్య (55) అనే దినసరి కూలీ స్వగ్రామంలో సరైన పని లేక పోవడంతో రూ. 2 లక్షల వరకు అప్పు చేసి గత రెండేళ్ల కిందల గల్ఫ్ దేశం సౌదీ వెళ్లాడు. అక్క డ పని సరిగా ఉండక జీతం సరిపోకపోవడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక మదనపడుతుండేవాడు. ఇదే క్రమంలో ఇంటికి పోదామంటే సైతం డబ్బులు లేకపోవడంతో మనోవేదనకు గురయ్యాడు. దీనికి తోడు ఇంటి వద్ద అప్పులవాల్ల ఒత్తిడి పెరగడంతో తీవ్రంగా కుమిలిపోయిన దేవయ్య గత నెల 8న సౌదీలో గుండెపోటుతో మృతిచెందాడు. మృతదేహం కోసం ఎదిరి చూసిన కుటుంబ సభ్యులకు 32రోజులకు ఇంటికి చేరడంతో అ కుటుంబం గుండెలావిసేలా రోదించిన తీరు పలువురిని కలిచి వేసింది. ఎంతో ఆశతో వెళ్లిన వ్యక్తి, శవపేటికలో రావడంతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. మృతునికి భార్య దేవవ్వ, కుమారులు బాబు, ప్రశాంత్‌లు ఉన్నారు. మృతుని కుటుంబాన్ని మాజీ జడ్పిటిసి మల్లుగారి నర్సాగౌడ్, టిఆర్‌ఎస్ మండల శాఖ అధ్యక్షుడు లింగన్నగారు, దయాకర్‌రావు, మాజీ అధ్యక్షుడు కమ్మరి రాజారాం, షపీయోద్దీన్, హైమద్ తదితరులు పరామర్శించారు. ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని అదుకోవాలని స్థానికులు కోరారు.

Comments

comments