Search
Monday 23 July 2018
  • :
  • :

గ్రామ పాలనకు ప్రత్యేక అధికారులు

The deadline of local governing bodies is on August 10th

నియామక ప్రతిపాదనలు సిద్ధం చేయండి
వీడియో కాన్ఫరెన్స్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి

మన తెలంగాణ/నిర్మల్ : ఆగస్టు 10న స్థానిక సంస్థల పాలక మండళ్ల గడవు ముగుస్తున్నందున గ్రామ పాలన సవ్యంగా జరిగేందుకు తక్షణమే ప్రత్యేకాధికారుల నియామకాన్ని ప్రతిపాదనలు సిద్దం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు.
గురువారం హైదరాబాద్ సచివాలయం నుంచి పం చాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్ కమిషనర్ నీతూ ప్రసాద్ జిల్లా కలెక్టర్లు, జిల్లా పంచాతీరాజ్ అధికారులు, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారులు, డిఎఫ్‌ఓలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి నాగర్ కర్నూల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర హైకోర్టు గ్రామ పంచాయతీ ఎన్నికలపై స్టే విధించినందున ఆగస్టు 01 స్థానిక సంస్థల పాలక మండళ్ల గడవు ముగుస్తున్నందున పాలన స వ్యంగా జరిగేందుకు ప్రతీ గ్రాపంచాయతీకి ప్రత్యేకాధికారిణి నియమించుటకు జిల్లా కలెక్టర్లు ప్రతిపాదనలు వెంటనే సిద్దం చేయాలన్నారు. ఎంపిడిఒ,వ్యవసాయ శాఖ, అర్ అండ్ బి, ఆర్‌డబ్లుఎస్ ఇరిగేషన్, సిడిపిఒ నియమించాలన్నారు. ఆగస్టు 02 నుండి ఉనికి రానున్న నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటుపై నిశానిర్దేశం చేశారు. అలాగే హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమ రూపంలో మొదలు పెట్టాలని ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, యువత, రైతు సంఘాలు తదితరులు భాగస్వాములు కావాలన్నారు. అలాగే ప్రతీ గ్రామంలో నర్సరీని ఏర్పాటు చేయాలన్నారు.
నిర్మల్ జిల్లా కలెక్టర్ ఎం.ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో పండ్లు మొక్కలు నాటేందుకు ఎక్కువగా డిమాండ్ ఉన్నందున పండ్ల మొక్కలను ఎక్కువ మొత్తంలో నాటేందుకు మొక్కలను సరఫరా చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి కార్యాలయ ఒఎస్‌డి ప్రియాంక, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి వెంకటేశ్వర్లు, డిఎఫ్‌ఒ దామోదర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments