Home నిర్మల్ ప్రత్యేక రాష్ట్రంలోనే ఆలయాల అభివృద్ధి

ప్రత్యేక రాష్ట్రంలోనే ఆలయాల అభివృద్ధి

The development of temples in a separate state

విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

మన తెలంగాణ/నిర్మల్‌టౌన్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోనే రాష్ట్రంలోని ఆలయాలు అభివృద్ధి జరుగుతున్నాయని రాష్ట్ర గృహ నిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. శనివా రం బంగల్‌పేట్‌లోని బోయవాడలో నూతనంగా నిర్మించిన శ్రీ అభయాంజనేయ స్వా మి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి మంత్రి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా మంత్రి ఆలయ కమిటీ సభ్యులు భాజాభజంత్రీలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ నిర్మల్ నియోజకవర్గంలో ఇప్పటికే 500 ఆలయాలకు నిధులు మం జూరు చేయడం జరుగుతుందన్నారు. ము ఖ్యంగా బంగల్‌పేట్ బోయవాడ కాలనీవాసుల ఏళ్ల కల నెరవేరిందన్నారు. ఆలయాలకు భక్తులు వచ్చినట్లైతే మనసుకు ప్రశాంతత లభిస్తుందన్నారు. ఆలయాల దర్శనాలతో ఆలయ అభివృద్ధి సైతం కొనసాగుతుందన్నారు. ఆలయాల పునఃరుద్దరణతో పాటు నూతన ఆలయాలకు అధిక నిధులు కేటాయిస్తున్న ఘనత కెసిఆర్ ప్రభుత్వానిదే అన్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మంత్రికి, కాంట్రాక్టర్, దేవాదాయ శాఖ అధికారులకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి , మార్కెట్ కమిటీ చైర్మన్ ధర్మాజి రాజేందర్, గ్రంథాలయ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, ఆడెల్లి ఆలయ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, దేవరకోట చైర్మన్ ఆమెడ కిషన్, స్థానిక కౌన్సిలర్లు కత్రోజ్ సునిత కృష్ణ, ప్రదీప్, అరుణ్‌కుమార్,గణేష్,గోపి, రాజేందర్, ఎస్‌పి రాజు, తోట నర్సయ్య, కోటగిరి అశోక్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

5 రోజుల నుండి ప్రత్యేక పూజలు : బంగల్‌పేట్ బోయవాడ కాలనీలో నూతనంగా రూ. 10లక్షలతో నిర్మించిన శ్రీ అభయాజంనేయ స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్టాపనోత్సవం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం నుండి ప్రత్యేక పూజలు నిర్వహించిన వేదపండితులు మధ్యాహ్నం స్వామి వారి విగ్రహాన్ని వేద మంత్రోచనాల మధ్య ప్రతిష్టాపించారు. గత 5 రోజులపాటు ప్రతిష్టాపమహోత్సాన్ని చేపట్టగా ఆదివారం రోజున విగ్రహ ప్రతిష్టాపనతో కార్యక్రమం ముగుస్తుంది. ప్రతిష్టాపన సందర్బంగా భక్తులు స్వామి వారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. మధాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.