Search
Wednesday 26 September 2018
  • :
  • :

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

The development of villages is a government goal

వలిగొండ -తొర్రూరు రోడ్డును హైవేగా మార్చేందుకు ప్రతిపాదనలు
అనాజిపురం గ్రామంలో 33/11 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం
ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్

మన తెలంగాణ/మోత్కూరు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధ్దికి కృషి చేస్తుందని , తెలంగాణ రాష్ట్రం సాదించుకున్న నాటి నుండి నేటి వరకు జరిగిన అభివృద్దే అందుకు నిదర్శనమని తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. బుధవారం మోత్కూరు మండలంలోని అనాజిపురం గ్రామంలో రూ.10లతో నిర్మించిన సిసిరోడ్లకు ప్రారంభోత్సవం, రూ.2.50లోలతో నిర్మించనున్న బస్ షెల్టర్, రూ.7.50లక్షలతో నిర్మించనున్న ఎస్సీ కమ్యూనిటీ హాల్‌లకు  ఎమ్మెల్యే కిశోర్‌కుమార్ శంఖుస్థాపనలు చేశారు. మోత్కూరు వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో ముందుభాగంలో రూ.46లక్షలతో నిర్మించనున్న షాపింగ్ కాంప్లెక్స్‌కు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఇప్పటి వరకు ఏరాష్ట్రంలో ఏనాయకుడు అమలు చేయని,ఆలోచన చేయని  విదంగా ముఖ్యమంత్రి కెసిఆర్ రైతులకు రైతు బందు పథకం ద్వారా పంటల పెట్టుబడి సాయం ఎకరాకు రెండు పంటలకు రూ.8వేలు, రైతులకు బీమా పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. చెరువులను పునరుద్దరించేందుకు మిషన్ కాకతీయ పథకం అమలు చేస్తున్నారని మిషన్ కాకతీయ ద్వారా తుంగతుర్తి నియోజకవర్గంలో 458చెరువులను రూ.193కోట్లతో అభివృద్ది చేసినట్లు తెలిపారు. మిషన్ భగీరథ కింద  ప్రతి ఇంటికి రోజుకు 100లీటర్ల మంచి నీటిని అందించలేకపోతే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనన్న నాయకుడు ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక్కరే అన్నారు. వలిగొండ-తొర్రూరు రోడ్డును హైవే గా మార్చేందుకు ప్రతిపాదనలు పంపినట్లు, పాటిమట్ల ఎక్స్ రోడ్డు నుండి అడ్డగూడూరు వరకు డబుల్ బిటి రోడ్డు నిర్మాణానికి రూ.10కోట్లు మంజూరు అయినట్లు తెలిపారు. అనాజిపురం గ్రామంలో  33/11 కెవి విద్యుత్ సబ్ స్టేషన్‌ను నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వ కృషి చేస్తుందన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసిన పార్టీ ఏదైనా ఉంటే అది ఒక్క టీఆర్‌ఎస్ పార్టీయే నని అన్నారు.  ఈకార్యక్రమాల్లో రైతు విభాగం రాష్ట్ర అద్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, మార్కెట్ చైర్మన్ చిప్పలపల్లి మహేంద్రనాథ్,ఎంపిపి ఓర్సులక్ష్మి పురుషోత్తం,జెడ్పిటిసి చింతల వరలక్ష్మి, వైస్ ఎంపిపి వంగాల లలిత, సర్పంచ్‌లు నిమ్మల వెంకటేశ్వర్లు, బయ్యని పిచ్చయ్య, ఎంపిటిసిలు జంగ శ్రీను, కుర్మిల్ల ప్రమీళ, విష్ణుమూర్తి, జనార్దన్‌రెడ్డి, ఎంపిడివో పి.ఉమాదేవి, పంచాయితీ రాజ్ డిఈ, ఏఈలు,మార్కెట్ కార్యదర్శి ఉమామహేశ్వర్‌రావు, పంచాయితీ కార్యదర్శులు,  రైతు సమన్వయ సమితి జిల్లా డైరెక్టర్ కొమ్మిడి ప్రభాకర్‌రెడ్డి, మోత్కూరు, అడ్డగూడూరు మండలాల కోఆర్డినేటర్లు కొండా సోంమల్లు, తీపిరెడ్డి మేఘారెడ్డి,టెలీకాంబోర్డు ఉమ్మడి జిల్లా డైరెక్టర్ చౌగోని సత్యంగౌడ్, టీఆర్‌ఎస్వీ సూర్యాపేట జిల్లా కోఆర్డినేటర్ కల్లెట్లపల్లి శోభన్‌బాబు,టీఆర్‌ఎస్ మండల పార్టీల అధ్యక్షులు కొణతం యాకూబ్‌రెడ్డి, పొన్నాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments