Home జోగులాంబ గద్వాల్ పడమటి అంజన్న బ్రహ్మోత్సవాలకు పోటెత్తిన భక్తులు

పడమటి అంజన్న బ్రహ్మోత్సవాలకు పోటెత్తిన భక్తులు

god

మన తెలంగాణ/మక్తల్: పడమటి ఆంజనే యస్వామి బ్రహ్మోత్సవాల్లో ఆదివారం సర్పం చ్ భాగ్యచంద్రకాంత్‌గౌడ్, వంశ పారంపర్య ఆలయ ధర్మ కర్త భీమాచార్యులు, దేవస్థానం ఇఒ రాజలింగం మంగళ వాయిద్యాలతో స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఎంఎల్‌ఎ చిట్టెం రామ్మోహన్‌రెడ్డి సుచరిత రెడ్డి దంపతులు నియోజక అభివృద్ధి సాధించాలని ఆకాంక్షిస్తూ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. లయన్స్ క్లబ్ భీమా ఆధ్వర్యంలో భక్తుల పిండి వంటలకై ప్రత్యేకంగా గ్రాండర్ లను నెలకొల్పి ఎంఎల్‌ఎ చిట్టెం,సుచరిత దంపతుల చేత ప్రారంభించారు. దీంతో భక్తులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమం లో మార్కెట్ చైర్మన్ నర్సింహ్మగౌడ్, డాక్టర్ శ్రీరామ్, మహిపాల్ రెడ్డి, రాజేష్‌గౌడ్, రాజ మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాలకు పోటెత్తిన భక్తులు: స్వామి వారి రథోత్సవానికి ఆదివారం ఉదయం 5 గంటల నుంచే తండోపతండాలుగా రావడం తో దేవాలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. భక్తుల రద్దీ పెరగడంతో పోలీసులు బందో బస్తు చర్యలు చేపట్టారు. సిఐ వెంకట్, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు ఆలయ ఆవరణ స్థలంలో వాహ నాలను దారి మరల్చి భక్తులకు అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకున్నారు. స్వామి వారి మొక్కులు తీర్చుకునేందుకు పట్టణంలోని తదితర కాలనీల నుంచి స్వామివారికి జ్యోతిని మోసి మొక్కులు చెల్లించుకున్నారు.
భక్తులతో కలిసి పండి వంటలు చేస్తున్న చిట్టెం సుచిరిత:స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తులు దేవస్థాన ఆవరణలో పిండి వంటలు చేస్తుండగా ఎంఎల్‌ఎ సతీమణి చిట్టెం సుచరిత రెడ్డి భక్తులతో కలిసి భక్షాలు, పిండి వంటలు చేశారు. అనంతరం జాతరలో తిరుగుతున్న పిల్లకలు మిఠాయిలు అందజే శారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల తో కలిసి భక్తుల సౌకర్యాలైన సాగునీరు, వైద్య, తదితర సదుపాయాలపై ముందస్తు చర్యలు చేపట్టారు.వంద కోట్ల దేవుని భూమి అన్యాక్రాతం, ఇక్కట్లో భక్తులు..శ్రీ పడ మటి ఆంజనేయస్వామి దేవాలయం పేరుపై 8 ఎకరాల 24 గుంటల భూమి ఉందని, వాటి లో 5 ఎకరాలకు పైగా అన్యాక్రాంతమైందని, దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష ధోరణి అవలంభించడంతో దేవుని భూములు భూ కబ్జాదారుల చేతిలో మగ్గుతున్నాయని భక్తులు విమర్శిస్తున్నారు. భూకబ్జాలకు పాల్ప డి వారు కోట్ల రూపాయలకు పడగలెత్తిన వారే కావడం గమనార్హం. రాయిచూర్, హైదరా బాద్ రహ దారి పక్కన ఆలయ భూములు ఉండడంతో వ్యాపార కేంద్రంగా మారడంతో స్వామి వారి భూములు భూ కబ్జా దారుల చేతి లో వంద కోట్ల రూపాయలు విలువైన భూము లు అన్యా క్రాంతంగామారయని భక్తులు వివరించారు. బ్రహ్మోత్సవాలకు మహారాష్ట్ర, కర్ణాకట, హైదరాబాద్, తదితర దూర ప్రాం తాల నుంచి స్వామికి మొక్కలు తీర్చుకోవ డానికి ఇక్కడి వస్తే వసుతులు లేవు. దీంతో కొందరు ప్రైవేట్ వ్యాపారులదుకాణాల ముం దు దేవుని పండి వంటలు చేస్తున్నామని భక్తు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై దేవా దాయ శాఖాధికారులు దృష్టిసారించివంద కోట్ల విలు వైన దేవుని భూముల అన్యాక్రాంతం నుంచి విముక్తి చేసి భక్తులకు మెరు గైన వసతులు కల్పించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.