Search
Saturday 17 November 2018
  • :
  • :

విదేశాలలో అదృశ్యమైన కొడుకు… వృద్ధ దంపతుల ఆవేదన..!

The disappeared son abroad the elderly couple's sadness

మాదన్నపేట్‌: విదేశాలకు వెళ్లిన కొడుకు ఫోన్ చేయడం మానేశాడు. తీరా ఆ తల్లిదండ్రులు ఫోన్ చేస్తే స్వీచ్ ఆఫ్ వస్తుంది. గత కొద్ది కాలంగా తన కొడుకు ఫోన్ చేస్తాడేమోనన్ని ఎదురు చూస్తున్న ఓ వృద్ధ దంపతుల విషాదగాధ. విదేశాలో ఉన్న తన కొడుకు ఆచూకీ కనిపెట్టాలని పోలీసులను, నాయకులను ప్రభుత్వ శాఖలను వేడుకుంటున్న ఫలితం లేకుండా పోయింది. వివరాలోకి వెళ్లితే…  సైదాబాద్ వినయ్‌నగర్‌కు చెందిన బంగారం, పుష్పలతలకు ఒక కుమారుడు, ఒక కుమార్తె కలరు. బంగారం విశ్రాంతి ఇంజనీర్. కష్టపడి తనకుమారుడైన రాఘవేంద్రరావును చదివించాడు. అనంతరం అతనికి కాలిఫోర్నియా మైక్రోసాప్ట్‌లో ఉద్యోగం రావడంతో 2011 డిసెంబర్‌లో విదేశాలకు వెళ్లాడు. ప్రతి రోజు ఫోన్ చేసి తల్లిదండ్రులతో మాట్లాడేవాడు. ఆ వృద్ధ దంపతుల ఆనందానికి హద్దులు లేవు. తమ కష్టాలు తీరాయనుకున్నారు. కానీ 2017 అక్టోబర్ తన కొడుకు చివరి కాల్ అవుతుందని అనుకోలేదు. అప్పట్నుంచి ఇంత వరకూ ఫోన్ రాలేదు. వారు ఫోన్ చేస్తే స్వీచ్ ఆఫ్ వస్తుంది. ఏమి చేయాలో తెలియక ఆ దంపతులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. సచివాలయంలో ఎన్‌ఆర్‌ఐ వింగ్ కూడా ఆర్జీ పెట్టుకున్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖకు సమాచారం అందజేస్తామని తెలిపారు. ఆ వృద్ధ దంపతులు తన కొడుకు ఆచూకీ కనిపెట్టాలని వేడుకుంటున్నారు.

Comments

comments