Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

ధాన్యం కొనుగోళ్లలో జిల్లా ప్రథమ స్థానం

The district is the number one in cereal purchases

The district is the number one in cereal purchases

 5 లక్షల మెట్రిక్ టన్నుల లక్షం
డిఎస్‌వో ఉదయ్‌కుమార్
మనతెలంగాణ/మిర్యాలగూడ : ధాన్యం కొను గోళ్లలో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలి చిందని డిఎస్‌వో ఉదయ్‌కుమార్ తెలిపారు. సోమ వారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడమే ప్రభు త్వ లక్షమని, అందులో నేటి వరకూ లక్షా 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామ న్నారు. జిల్లా వ్యాప్తంగా 216 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, 15671 మంది రైతులకు రూ.52 కోట్లా 67 లక్షలా 87 వేలు చెల్లింపులు జరిపామన్నారు. రూ.116 కోట్ల బకాయిలు న్నాయని, వాటిని త్వరలో చెల్లిస్తామన్నారు. ధాన్యం కొనుగోళ్లలో అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు ఉత్పన్నమౌతున్నాయని, వాటిని అధిగమించి కొనుగోళ్లు వేగవంతంగా జరుపు తామన్నారు. వచ్చే మే 15 వరకు ధాన్యం కొనుగోళ్లు జరుపుతారని రైతులు ఆందోళన చెందుతు న్నారని, జూన్ చివరి వరకూ కొనుగోళ్లు చేస్తామన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్షం తగదు : ఆర్డీవో
ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్షం తగదని, విక్రయానికి వచ్చిన ప్రతి గింజను త్వరితగతిన కొనుగోలు చేయా లని రాజస్వ మండలాధికారి జగన్నాధరావు ఆదే శించారు. సోమవారం ఆర్డీవో కార్యాల యంలో సివి ల్ సప్లయ్, ఐకెపి నిర్వాహకులు, రైస్‌మిల్లర్స్, లారీ యజమానులతో ధాన్యం ఎగుమతి, దిగు మతిపై సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణంలో వస్తున్న మా ర్పుల వల్ల అకాల వర్షాలు పడే అవకాశము న్నందు న అమ్మకానికొచ్చే ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కొను గోళ్లు చేసి తరలించేందుకు చర్యలు తీసుకోవాల న్నా రు. సమావేశంలో డిఎస్‌వో ఉదయ్‌కుమార్, సివిల్ సప్లయ్ డిఎం భాస్కర్‌రావు, తహసీల్దార్ మాలి కృష్ణా రెడ్డి, ఎంవీఐ శ్రీనివాస రెడ్డి, మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కర్నాటి రమేష్, రఘు పాల్గొన్నారు.

Comments

comments