Search
Wednesday 26 September 2018
  • :
  • :

మే నెలలో లక్షాన్ని ఛేదించిన డివిజన్

The division that hit the target in May

రక్తదాన నమోదుకు ముందుకు రండి
జిఎం విజయబాబు వెల్లడి

మనతెలంగాణ/యైటింక్లయిన్‌కాలనీ: కొత్త ఆర్థిక సం వత్సరం ప్రారంభంలోనే కార్మికులు డివిజన్‌కు కేటాయి ంచిన లక్షాన్ని ఛేదిస్తున్నారని,ఇందులో భాగంగా మే మాసంలో కంపెనీ నిర్ధేశించిన లక్షాన్ని అధిగమించారని ఆర్‌జి2 జిఎం విజయబాబు అన్నారు. శుక్రవారం జిఎంకార్యాలయంలోజరిగిన విలేకరుల సమావేశం లో మే మాస ఉత్పత్తి ఉత్పాదకత వివరాలను జిఎం వెల్లడించారు. మే మాసంలో 12.19 లక్షలకు గాను 12.80 ల క్షల టన్నుల ఉత్పత్తి జరిగిందన్నారు. ఇందులో ఓసిపి3 ప్రాజెక్టులో 108శాతం ఉత్పత్తి జరగడం గమనార్హమన్నారు. భూగర్భ గనులైన 7 ఎల్‌ఇపి, వకీల్‌పల్లి గనుల్లో కేవలం 72శాతం ఉత్పత్తి వచ్చిందన్నారు. మిగిలిన 10 నెలల్లో కంపెనీ డివిజన్‌కు నిర్ధేశించిన 73 లక్షల 40వే ల టార్గెట్‌ను ఛేధించాలన్నారు. రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలని, అనేక కొత్త కొత్త రికార్డులు నమోదు చే యాలన్నారు. జూన్ 2న జరిగే తెలంగాణ ఆవిర్భావ వే డుకలను కార్మిక కుటుంబాలు దిగ్విజయం చేయాలని కోరారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సెక్టర్3 డి స్పెన్సరీలో రక్త గ్రూపులను తెలిపే శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఎవరికైనా రక్తం అవసరమై న పక్షంలో తీసుకోవడానికి వీలవుతుందన్నారు. కాలనీవాసులు ముందుకు వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. సమావేశంలో ఎస్‌ఒటుజిఎం కె.రవీందర్, ప్రా జెక్టు అధికారి జె. రమేష్, ఎజిఎం స్వామినాయుడు, ఏ జెంట్ కరుణాకర్, డాక్టర్ రమేష్‌బాబు, డిజిఎం వెంకటేశ్వర్‌రావ్, సివిల్ రామకృష్ణ, చిరంజీవి, పద్మారావ్, పిఎం అరవింద్‌రావ్, రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.

Comments

comments