Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

38 వేలకు చేరువలో సెన్సెక్స్

The domestic bourses gained and recovered well

ముంబయి: దేశీయ మార్కెట్లు మళ్లీ పుంజుకుని మంచి లాభాలను నమోదు చేశాయి. బ్యాంకింగ్, మెటల్, ఫార్మా రంగ షేర్లలో కొనుగోళ్లు మార్కెట్లను పరుగులు పెట్టించాయి. దీంతో సూచీలు భారీ లాభాలను సొంతం చేసుకున్నాయి. సెన్సెక్స్ దాదాపు 284 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ మళ్లీ 11,450 మార్క్‌ను దాటి సరికొత్త రికార్డును నమోదుచేసింది. అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉండటంతో పాటు దేశీయంగా మార్కెట్లకు సానుకూలంగా మారింది. మార్కెట్ ముగిసే సరికి సెన్సెక్స్ 284.32 పాయింట్లు పెరిగి 37947.88 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 85.70 పాయింట్లు లాభపడి 11470.75 పాయింట్ల వద్ద స్థిరపడింది. యాక్సిస్ బ్యాంక్, సన్‌ఫార్మా, మారుతి సుజుకీ, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐటిసి షేర్లు లాభాలను నమోదు చేశాయి. మరోవైపు టెక్ మహింద్రా, భారత్ పెట్రోలియం, ఎయిర్‌టెల్ తదితర షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

Comments

comments