Home ఎడిటోరియల్ అధ్వాన్నంగా ఆర్థిక దృశ్యం

అధ్వాన్నంగా ఆర్థిక దృశ్యం

edit

గత నాలుగేళ్లుగా ఆర్థికవ్యవస్థ అధ్వాన్నంగా ఉండడం ప్రభుత్వాన్ని, ప్రజలను కూడా ఆందోళనలో పడవేస్తోంది. 201819 ఆర్థిక సర్వేలో చిత్రించిన విధంగా ఆర్థికవ్యవస్థ దూసుకుపోవడం లేదు. ఇది మోడీ ప్రభుత్వ ఐదవ, ఆఖరి బడ్జెట్‌ను కంపింపచేస్తున్న అంశం. ఆర్థిక సర్వే రచయితలు కూడా ఆశలకు అనుగుణంగా ఆర్థిక వ్యవస్థ పనితీరు ఉండగలదా అన్న ఆందోళనను ఆ పత్రంలో వెలిబుచ్చారు.
ప్రజలు కూడా తమను కష్టాల పాలుచేస్తున్న ప్రభుత్వాన్ని కూల్చడానికే ప్రాముఖ్యం ఇస్తారు. తామనుభవించిన నష్టాలను మరిచిపోయేలా చేసే ప్రయోజనాలను కల్పించినా పట్టించుకోరు. రాజకీయాలకు కూడా ప్రజల ఆర్థిక పరిస్థితి అతి ముఖ్యం. ప్రస్తుతం ప్రభుత్వంలో ఆందోళన పెరిగిన కారణం కూడా అదే. ఎందుకంటే గత నాలుగేళ్లుగా ఆర్థిక వ్యవస్థలో వరుసగా ప్రయోగాలను చూశాము. భవిష్యత్తులో లాభం ఇచ్చినా తక్షణమే భారీ నష్టాన్ని కలిగించిన ప్రయోగాలు అవి. ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల వ్యక్తులు తమకు అవసరమైన సేవలు, సరకులు పొందడానికి ఎక్కువ డబ్బు ముట్టజెప్పారు. సరకులు, సేవల పన్ను(జిఎస్‌టి) అమలు తర్వాత ప్రత్యక్ష పన్ను చెల్లింపుదార్ల సంఖ్య 50 శాతం పెరిగిందని సర్వే తెలిపింది.
జిఎస్‌టి వల్ల ద్రవ్యోల్బణం అదుపులో ఉందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ దాని అమలుతో సరుకులు, సేవల ఖర్చు పెరిగింది. ఇందులో ప్రజలకు కలిగిన నగదు నష్టం కేవలం ప్రకటనలతో తీరదు. అంతేకాకుండా, 2018లో జీవన వ్యయం పెరగబోతోంది. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరగడం, వాటి గిరాకీ కూడా దేశీయం గా పెరగడం వల్ల జీవన వ్యయం మరింత భారం కానుంది. చమురు ధరలు తగ్గుతున్నప్పుడే పరిస్థితి మెరుగుకానప్పుడు అవి పెరుగుతున్నప్పుడు ఎలా మెరుగవుతుంది? ఇపిఎఫ్, ఇఎస్‌ఐ వంటి సామాజిక భద్రత సౌకర్యాల వ్యవసాయేతర ఉపాధి వ్యవస్థీకృత రంగంలో ఉద్యోగాల సంఖ్య ప్రస్తుతం 7.5 కోట్లు ఉంది. ఇది మొత్తం ఉద్యోగులలో 31 శాతం. అయితే ఇటీవల అమలులోకి తెచ్చిన జిఎస్‌టి నెట్‌వర్క్ ఈ సంఖ్యను 12.7కోట్లుగా చూపుతోంది. అంటే మొత్తం ఉద్యోగులలో 53 శాతం.
కార్మిక సంస్కరణల భూతం
ప్రభుత్వంపై విరుద్ధ ప్రభావం చూపే అంశాల్లో కార్మిక సంస్కరణలు, భూముల సేకరణ చట్టాల్లో మార్పు లు కూడా చేయబోతున్నాయి. ఆ మార్పులను పరిశ్రమలకు, వ్యాపార వర్గాలకు అనుకూలంగా మార్చబోతున్నారు. ఇది కూడా రాజకీయంగా ప్రభుత్వానికి ఎదురుతన్నవచ్చు. ప్రజలను ఎన్ని రకాలుగా ప్రభుత్వం మభ్యపెడుతోందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా సిబిఐపై, పన్నుల శాఖలపై చాలా ఆరోపణలు వినవస్తున్నాయి. ముఖ్యంగా నోట్ల రద్దు, జిఎస్‌టి అమలు తర్వాత ఈ ఆరోపణలు పెరిగాయి. ఆర్థిక సర్వేలో న్యాయ విచారణ సాగుతున్న ప్రత్యక్ష పన్నుల కేసులపై ఇచ్చిన సమాచారం అంత సరిగా లేదు. 27శాతం ప్రత్యక్ష పన్నుల కేసులు ఆదాయం పన్ను అపిల్లేట్ ట్రిబ్యునల్(ఐటిఎటి), కస్టమ్స్ అండ్ సర్వీస్ టాక్స్ అపిల్లేట్ ట్రిబ్యునల్ (సిఇఎస్‌టిఎటి) వద్ద, 13 శాతం కేసులు హైకోర్టుల వద్ద విచారణలో ఉన్నట్లు సర్వే పేర్కొంది.
ఐటిఎటి/సిఇఎస్‌టిఎటి వద్ద 12శాతం కేసులు, సుప్రీంకోర్టులో 11శాతం కేసులు, హైకోర్టులలో 46 శాతం కేసులు ఉన్న విషయం యదార్థం. ప్రభుత్వ శాఖలను దుర్వినియోగపరుస్తున్న తీరుకు ఓటు బ్యాంకులో చాలా భాగం అసమ్మతి పెంచుకొని ఉంది. హై ప్రొఫైల్ కేసులు కేవలం 0.2శాతం మాత్రమే. ఇది వివాదంలో ఉన్న మొత్తం విలువలో 56శాతం. పెండింగ్ కేసుల్లో 66 శాతం ఒక్కొక్కటి రూ.10లక్షలు కంటే తక్కువ విలువ గలవి. రానున్న ఎన్నికల్లో ఈ గ్రూపు ప్రజలు మోడీకి ఎదురు తిరిగే ప్రమాదం ఉంది. దేశంలో ఇంకా వ్యవసా య రంగమే అత్యంత ప్రాధాన్యం గలది. ఎందుకంటే మన జనాభాలో 70శాతం మందికి అదే జీవనోపాధి కల్పిస్తోంది. స్థూల దేశీయ ఉత్పత్తి(జిడిపి)లో దాని భాగం 16 శాతం. అంటే చెప్పుకోదగ్గంత. 49 శాతం మంది ప్రజలకు ఆ రంగం ఉపాధి కల్పిస్తోంది. వ్యవసాయ రంగం పనితీరు కుంటుపడితే ద్రవ్యోల్బణం, రైతుల్లో నిరాశ, అశాంతి పెరుగుతాయి. రాజకీయ, సామాజిక అనాసక్తత పెచ్చుమీరుతుంది. ఇవన్నీ కలిసి ఆర్థిక వ్యవస్థను కుంగదీస్తాయి.
201718 సంవత్సరానికి తొలి అంచనాల ప్రకా రం జాతీయ ఆదాయంలో వృద్ధి ‘గ్రాస్ వ్యాల్యూయాడెడ్ (జివిఎ)’లో 2.1శాతం ఉండగలదని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఇది ఇంతకు ముందు ఏడాది వృద్ధి రేటు(4.9)తో పోల్చితే సగం కంటే తక్కువ. ఓటర్లలో చాలామంది ఈ వర్గం ప్రజలే. వీరు మోడీ రాజకీయ భవితవ్యాన్ని విరుద్ధంగా ప్రభావితం చేసే ప్రమాదం ఉంది. అయితే అలా కాకుండా ఉండాలంటే ఆకర్షణీయమైన ప్యాకేజీని ఈ ఎన్నికల సంవత్సరంలోనే ప్రకటించి, అమలు పర్చాలి.
పారిశ్రామిక రంగం కూడా..
2016 నుంచి పారిశ్రామిక రంగం పనితీరు కూడా చాలా కనాకష్టంగా ఉంది. మన పరిశ్రమలు తమ ఉత్పత్తి సామర్థంలో 75శాతం కంటే తక్కువ వినియోగించుకుంటున్నాయి. ఈ విపరిణామం 2016లో నోట్ల రద్దు ప్రకటించినప్పటి నుంచి కనపడుతోంది. 2016 జూన్ నుంచే పారిశ్రామిక రంగంలో మాంద్యం కనపడుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ దాకా పారిశ్రామిక ఉత్పత్తి కేవలం 3.2శాతం రేటున పెరిగింది. ఈ రేటు అంతకు ముందు ఏడాది అదేకాలంలో 5.5శాతం ఉండేది. 2007లో స్థూల జాతీయ ఉత్పత్తి(జిడిపి)లో స్థూల స్థిర పెట్టుబడి రూపొందడం 35.6శాతం దాకా చోటు చేసుకుంది. ఇది 2017లో 26.4 శాతానికి దిగిపోయింది. అలాగే జిడిపిలో దేశీయ ఆదా నిష్పత్తి కూడా 38.3 శాతం నుంచి 29.0శాతానికి 2016లో పడిపోయింది. భారతదేశ చరిత్రలో అటువంటి పెట్టుబడి ఆటుపోట్లు ఎన్నడూ సంభవించలేదు. పెట్టుబడులు, ఆదా రేట్లు రెండూ పడిపోవడం అనూహ్యమైన విపరిణామం. 1991లో ‘బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్’ సంక్షోభం తరుణం లో కూడా అలా జరగలేదు. పెట్టుబడులకు పెద్దగా ప్రోత్సాహకాలు కల్పించడం ప్రభుత్వానికి తలకు మించి న భారంగా పరిణమించింది. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో, పారిశ్రామిక రంగంలో రెండింటా ఈ ప్రోత్సాహకాలకు అనుకూలంగా మన ఆర్థిక పరిస్థితి లేదు. గత ఏడాదిగా చేపట్టిన ఆర్థిక సంస్కరణలు వచ్చే ఏడాది సత్ఫలితాలిస్తాయని ఆర్థిక సర్వే చేసిన జోస్యం నిజం కావాలని మోడీ ప్రభుత్వం ఎంతైనా కోరుకొంటోంది. జిఎస్‌టిని తరుచూ మార్చడం నూతన దివాళా నిబంధనలు ఆర్థిక స్థితిని గట్టున పడేస్తాయని ఆర్థిక సర్వే ఊహాగానం చేసింది. 201718 రెండవ అర్ధ భాగంలో ఆర్థిక వ్యవస్థ పురోగతి వేగం పుంజుకున్నట్లు సర్వే ఆశ లు రేకెత్తించింది. అలా జరగాలంటే జిడిపి వృద్ధి 2017 18లో 6.75 శాతం చేరుకోవాలి. అంతే కాకుండా 201819లో 77.5శాతం చేరుకోవాలి. మొత్తానికి ఆర్థిక సర్వే ధైర్యం చెబుతున్నా, వాస్తవాలు భయపెట్టడం మానలేదు. ఇది ఎన్నికల సంవత్సరంలో మోడీ ప్రభుత్వానికి గొంతులో పచ్చి వెలక్కాయలా మారిందని చెప్పవచ్చు.

* జ్ఞాన్ పాథక్