Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

కెటిఆర్‌కు వృద్ధురాలి ఫిర్యాదు

The Elderly woman  complaint to the KRR

అక్రమ వంటగది నిర్వహణపై కెటిఆర్‌కు వృద్ధురాలి ఫిర్యాదు 24 గంటల్లోనే సమస్య పరిష్కారం

మన తెలంగాణ/సిటీబ్యూరో: సమస్యపై ఇచ్చిన ఫిర్యాదును 24 గంటల్లోగా పరిష్కారం కావడంతో 86 ఏళ్ల శేషానవరత్నం అనే వృద్ధ్దురాలు మున్సిపల్ శాఖమంత్రి కె.టి.రామారావుకు ధన్యవాదాలు తెలిపింది. శుక్రవారం కూకట్‌పల్లిలో జరిగిన ‘మన నగరం’ కార్యక్రమానికి శేషానవరత్నం హాజరయ్యారు. తను నివాసం ఉంటున్న ఇంటి కింద అక్రమంగా వంట గదిని నిర్వహిస్తున్న కృతుంగా రెస్టారెంట్‌పై ఫిర్యాదు చేసింది. కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ వంట గదితో పై అంతస్తులో ఉంటున్న తమ కుటుంబానికి ప్రమాదం ఉందని తెలిపింది. ఎలాంటి అనుమతులు లేకుండా వంటగది నిర్వహించడంతో పాటు కోర్టు కేసులతో తమను వేధిస్తున్నారని మంత్రికి ఆమే మొరపెట్టుకున్నారు. దీనిపై స్పందించిన మంత్రి, సమస్యను పరిష్కరించాలని అధికారులను అదేశించారు. మంత్రి అదేశాల మేరకు జోనల్ కమిషనర్లు హరిచందన, శంకరయ్యల నేతృత్వంలో అధికారుల బృందం శనివారం రెస్టారెంట్‌ను తనిఖీ చేసింది. పై అంతస్తులో ఉంటున్న వారి కి ఇబ్బందులు కలిగించడంతో పాటు భారీ సిలిండర్లను వినియోగించడంతో పెను ప్రమాదానికి ఆస్కారం ఉందని గుర్తించారు. దీంతో పాటు రెస్టారెంట్‌కు ట్రేడ్ లైసెన్స్‌తో పాటు ఫైర్ సేప్టీ ప్రమాణాలు కూడా లేవని అధికారులు తెలుసుకున్నారు. దీంతో అక్రమంగా నడుస్తున్న వంటగదితో పాటు పరిసరాలను సీజ్ చేశారు. జిహెచ్‌ఎంసి అధికారుల చర్యపై శేషనవరత్నం సంతోషం వ్యక్తం చేసింది. అక్రమంగా వంటగదిపై ఇప్పటికే అధికారులకు పలుసార్లు ఫిర్యాదు చే శామని, అయితే కోర్టు కేసు పేరు చెప్పి రెస్టారెంట్ నిర్వాహకులు వారిపైనా ఒత్తి డి తీసుకొచ్చే ప్రయత్నం చేశారన్నారు. మన నగరంలో నేరుగా మంత్రికి ఫిర్యా దు చేయడంతో యంత్రాంగం కదిలివచ్చి, రెస్టారెంట్‌ను సీజ్ చేయడంతో ఎన్నో ఏళ్ల సమస్య పరిష్కారమైనందుకు ఆమే ఆనందం వ్యక్తం చేశారు.

Comments

comments