Search
Wednesday 18 July 2018
  • :
  • :

ట్రాఫిక్ ఇబ్బందులపై పోలీసుల నజరు

The Exchange bus route to Vijayawada and Khammam

విజయవాడ, ఖమ్మం వైపు వెళ్లే బస్సు రూట్ల మార్పిడి
ట్రాఫిక్ క్లియరెన్సుపై దృష్టి సారించిన డిఎస్పీ నాగేశ్వరరావు
ట్రాఫిక్ సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్న పోలీసులు

మన తెలంగాణ/సూర్యాపేట క్రైం: జిల్లా కేంద్రంగా సూర్యాపేట ఏర్పడిన నాటి నుండి ట్రాఫిక్ ఇబ్బందులు ఇంకా సమసిపోలేదు. గతంలో నిర్మించిన కొత్త బస్టాండ్ ఫ్లైఓవర్ నుండి హైదరాబాద్, విజయవాడల వైపు వెళ్లే బస్సులు కొత్త బస్టాండ్ ద్వారా పట్టణంలోకి రావడంతో ట్రాఫిక్ సమస్య జఠిలంగా మారింది. వాస్తవానికి హైదరాబాద్, విజయవాడ వెళ్లే బస్సులు నేరుగా హైటెక్ బస్టాండ్‌లోకి వెళ్లి మళ్లీ జాతీయ రహదారిపైకి వెళ్లే విధంగా డిజైన్ చేయకుం డా ఉండడంతో గత కొన్నేళ్లుగా సూర్యాపేట పట్టణ వాసులకు కొత్త బస్టాండ్, హైటెక్ బస్టాండ్, ఫ్లైఓవర్‌ల వద్ద నిత్యం ట్రాఫిక్ రద్ది తప్పడం లేదు. దీనితో సూ ర్యాపేట డిఎస్పీ మేక నాగేశ్వరరావు ట్రాఫిక్ క్లియరెన్సు కోసం నడుం బిగించారు. జిల్లా ఎస్పీ ప్రకాశ్‌జాదవ్ ఆధ్వర్యంలో డిఎస్పీ నాగేశ్వరరావు పట్టణంలోని ప్రధాన సెంటర్లైన కోర్టు, శంకర్‌విలాస్, గాంధీ విగ్రహం, తెలంగాణ తల్లి విగ్రహం, కుడకుడ రోడ్డులలో స్టాఫర్స్, స్పీడ్‌బ్రేకర్స్ ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. అలాగే జాతీయ రహదారిపై అంజనాపురి కాలనీ, జనగాం క్రాస్ రోడ్డు, ఎన్‌టిఆర్ పార్కు దగ్గర, ఖమ్మం క్రాస్ రోడ్డు, వ్యవసాయ మార్కెట్ క్రాస్ రోడ్డు, ఈనాడు కార్యాలయం వద్ద కూడా స్టాఫర్స్‌ను ఏర్పాటు చేయడంతో ఇటీవల ప్రమాదాలు గణనీయంగా తగ్గాయి. తాజాగా బుధవారం హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్లే బస్సులు, హైదరాబాద్ నుండి ఖమ్మం, మణుగూరు, భద్రాచలం, కొత్తగూడెం, సత్తుపల్లి, మధిరల వైపు వెళ్లే బస్సులన్నింటినీ కూడా అంజనాపురి కాలనీ వద్ద నుండి జాతీయ రహదారి దగ్గర నుండి స్టాఫర్స్ ఏర్పాటు చేసి కుడి వైపు మళ్లించి హైటెక్ బస్టాండ్‌కు చేరుకొనే విధంగా ఏర్పాటు చేశారు. అలాగే హైటెక్ బస్టాండ్ నుండి బయటకు వచ్చిన బస్సులు కొత్త బస్టాండ్ నుండి ఎంఎన్‌ఆర్ హోటల్ పక్కగా కొత్త బస్టాండ్ మీదుగా ఫ్లైఓవర్ కింది నుండి విజయవాడ, ఖమ్మం వైపుకు వెళ్లే విధంగా చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించి ట్రాఫిక్ ఎస్సై సంతోష్‌కుమార్, ఇతర సి బ్బంది బుధవారం డిఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ట్రాఫిక్ మళ్లింపు చేశారు.
దీనితో పట్టణంలో కొత్తబస్టాండ్, హైటెక్ బస్టాండ్ ప్రాంతాలలో ఫ్లైఓవర్ నుండి ఎదురుగా బస్సులు వచ్చి ట్రాఫిక్ జాం కావడం, ప్రమాదాలు జరగడం తగ్గుతుంది. బస్సు డ్రైవర్లకు, ఇతర వాహనదారులకు బుధవారం ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించారు. పట్టణ ప్రజలు కూడా ట్రాఫిక్ రూల్స్ పట్ల అవగాహన పెంచుకొని పోలీసులకు సహకరించాలని డిఎస్పీ నాగేశ్వరరావు కోరారు.

Comments

comments