Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం

 adilabad1మాజీ ఎమ్మెల్సీ ప్రేం సాగర్‌రావు
మంచిర్యాల ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం అయిందని మాజీ ఎమ్మె ల్సీ ప్రేం సాగర్‌రావు అన్నారు. గురువారం సాయంత్రం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో ఈప్రభుత్వం విఫలమైందన్నారు. కేజి టూ పీజి ఉచిత విద్య, ఇంటికో ఉద్యోగం, నిరుపేదలకు డబుల్ బెడ్‌రూంలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఆ హామీలను మర్చి పోయారని ఎద్దేవ చేశారు. 2019లో రాష్ట్రంలో అధికారం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నా రు. ప్రజలకు అందుబాటులో ఉండిసమస్యల పరిష్కారం ప్రజలతో కలిసి పోరాటం చేస్తామన్నారు. ప్రస్తుతం నడుస్తు న్న పథకాలన్ని కాంగ్రెస్ హయాంలోనే చేపట్టినవని ఈ సందర్బంగా గుర్తు చేశారు. రైతుల రుణ మాఫీవిషయంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. దళితులకు ఇస్తానన్నా మూడెకరాల భూమి హామీ ఏ మైందని అన్నారు. రాష్ట్రంలో త్రాగునీటి కొరత త్రీవంగా ఉన్నప్పటికి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. జిల్లాలో పార్టీ పటిష్టానికి కృషి చేసి 2019 ఎన్నికల్లో పది నియోజకర్గాల్లో తొమ్మిది స్థానాల్లో గెలుపే లక్షంగా పని చేస్తామన్నారు. శాంతిగనిలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన కార్మికు లుకు 50లక్షల రూపాయల నష్ట పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ కమళాకర్‌రావు, నాయకులు సులేమాన్, సుంకి సత్యం, రమేష్, అబ్దుల్ సత్తార్, రాజ్‌కుమార్, ఖాసీం, కిషోర్, క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments