Home నవ విజ్ఞానం అంతరిక్షంలో అద్భుత గ్రహాంతర నౌక

అంతరిక్షంలో అద్భుత గ్రహాంతర నౌక

The fairy alien ship in space

అంతరిక్షంలో  గ్రహాంతర నాగరికులకు చెందినదిగా  భావింపబడుతున్న  అద్భుతమైన వస్తువు ఒకటి ప్రయాణిస్తుండడం శాస్త్రవేత్తలకు అంతుచిక్కని విశేషంగా మిగిలింది. ఇది ఎవరు ఎందుకు భూ కక్ష పరిధి లోకి పంపారో దీనివల్ల వారు ఏం సాధించాలనుకున్నారో తెలియడం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సౌరవ్యవస్థలో కనిపించిన మొట్టమొదటి అంతర నక్షత్ర మండల వస్తువు ఇదే అని భావిస్తున్నారు. వాస్తవంగా ఇది గంటకు 70 మైళ్ల వేగంతో ప్రయాణిస్తోంది. ఉపగ్రహానికి ఉండవలసిన వేగం కన్నా ఇది అత్యంత వేగంతో ప్రయాణించడమే ఆశ్చర్యం. సూర్యుని చుట్టూ ఇది పరిభ్రమించేటప్పుడు వేగాన్ని మరింత పుంజుకొంటుంది. సూర్యుడు, ఇతర గ్రహాల గురుత్వాకర్షణ శక్తి కన్నా ఏదో ఒకటి దీని చలనంపై ప్రభావం చూపిస్తోందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సైంటిస్టు మార్కో మైఖెలి పేర్కొన్నారు.

దీన్ని ఔముయాముయా గా పిలుస్తున్నారు. అంటే దూరం నుంచి వచ్చిన వార్తాహరుడు అని దీని అర్థం. 2017అక్టోబర్ 19న హవేలీ శాస్త్రవేత్తలు దీన్ని మొదట కనుగొన్నారు. గాఢమైన ఎరుపు రంగుతో తన వెడల్పు కన్నా పది రెట్లు ఎక్కువ పొడవుతో ఈ వస్తువు ఉంటోంది. అసాధారణ లక్షణాలు కలిగిన ఔముయాముయా సూర్యుని గురుత్వాకర్షణ శక్తి నిర్వహణలో ఉండే మార్గాన్ని తప్పింది. తోకచుక్క నుంచి వెలువడే వాయువులా కనిపిస్తున్నా చుట్టూ తోక వంటిది ఉందనడానికి సరైన ఆధారాలు లేవు. ఇది ఎందుకు దూసుకువెళ్తోందో శాస్త్రవేత్తలు చెప్పలేక పోతున్నారు. గ్రహాంతర నాగరికులు బుద్ధి పూర్వకంగా భూ పరిధి లోకి పంపిన పరిశోధక నౌకగా భావిస్తున్నారు. గ్రహాంతర వాసులకు నక్షత్ర ఆధార శక్తి వంతమైన వ్యోమ నౌకలున్నాయని, విధ్వంసాలలో కూడా వారు ఎలా బతికి ఉంటున్నారన్నది ఆలోచించ వలసిన విషయంగా హార్వర్డ్ ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్ ఏవి లోయెబ్ అభిప్రాయ పడ్డారు. ఇదివరకు దీన్ని తోకచుక్క అనుకునే వారు. కానీ హార్వర్డ్ శాస్త్రవేత్తల పరిశోధనల్లో తోకచుక్క కాదని తేలిపోయింది. సూర్యకాంతి నుంచి దీనికి అదనపు శక్తి సమకూరడంపై శాస్త్రవేత్తలు పరిశోధన సాగిస్తున్నారు.

                                                                                                                                                                                            – సైన్స్ విభాగం  

The fairy alien ship in space

Telangana Latest News