Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

పతనం దిశగా రూపాయి

Indian-rupeeన్యూఢిల్లీ: డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకీ మరింత బలహీనపడుతోంది. శుక్రవారం డాలర్‌పై రూపాయి 67 స్థాయిలో ఉంది. డాలర్ తో రూపాయి మారకపు విలువ రెండేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. క్రితం ముగింపుతో పోలిస్తే 30 పైసలు పడిపోయి రూ. 66.95కు చేరుకుంది. అమెరికాలో వడ్డీ రేట్లు పెరగవచ్చన్న అంచనాలు భారత మార్కెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీస్తున్నాయి. వారిని అమ్మకాల వైపు నడిపిస్తున్నాయి. బ్యాంకింగ్, విద్యుత్ కంపెనీల ఈక్విటీలు భారీగా నష్టపోయాయి. మార్కెట్ సూచీలు నష్టపోయి రెండు వారాల లాభాలకు బ్రేక్ పడింది. నిఫ్టీ కీలకమైన 7,800 పాయింట్ల వద్ద కొనసాగి ఆఖరికి దిగువకు పడిపోయింది. విదేశీ ఇన్వెస్టర్లతో పాటు దేశీయ ఫండ్ కంపెనీలు భారీగా ఈక్విటీలను విక్రయించినట్టు ఆర్థిక నిపుణులు తెలిపారు.

Comments

comments