Home తాజా వార్తలు చెరువులో దూకి కుటుంబం ఆత్మహత్య

చెరువులో దూకి కుటుంబం ఆత్మహత్య

Shameerpet-Lake

మేడ్చల్: జిల్లాలోని శామీర్‌పేట చెరువులో దూకి ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. బలవన్మరణానికి పాల్పడిన కుటుంబ సభ్యుల్లోని బాలిక మృతదేహాన్ని చెరువులో గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని స్థానిక ఈతగాళ్ల సహాయంతో చెరువులో మృతదేహాలను వెలికి తీసేందుకు యత్నిస్తున్నారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఆర్థిక సమస్యల నేపథ్యంలోనే కుటుంబం ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.