Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

మీకేమో అవార్డులు… మాకేమో శఠగోపమా..!

The famine that bothers the bills is drought

జగిత్యాలకు బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా స్వచ్ఛ భారత్ అవార్డు
మరుగుదొడ్లు నిర్మించుకుని ఏడాది గడిచినా బిల్లులేవి..?
బిల్లుల కోసం చెప్పులరిగేలా తిరిగినా పట్టించుకునే వారే కరువు

ప్రతి ఇంటా మరుగుదొడ్డి తప్పని సరిగా ఉండాలి… మరుగుదొడ్డి నిర్మించుకుంటే రూ.12 వేల ఆర్థిక సాయం అందిస్తాం… మరుగుదొడ్డి నిర్మించుకోకుంటే ప్రభుత్వ పథకాలు నిలిపివేస్తాం… నిర్ణీత కాలంలో నిర్మాణా లు పూర్తి చేసుకోవాలి..ఆలస్యం చేస్తే బిల్లులు రావంటూ అధికారులు పేర్కొనడంతో అప్పు సప్పు చేసి ప్రతి కుటుంబం మరుగుదొడ్లు నిర్మిం చుకున్నారు. అధికారులు భావించినట్లుగానే జిల్లాలోని ప్రతి ఇంట్లో మ రుగుదొడ్డి నిర్మాణం జరిగింది. దాంతో బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా జగిత్యాల గుర్తింపు పొంది స్వచ్చ భారత్ అవార్డుకు ఎంపికైంది. అయితే మరుగుదొడ్లు నిర్మించుకుని ఏడాది కావస్తున్నా తమకు బిల్లుల కు రాకపోవడంతో లబ్దిదారులు ఆందోళన చెదుతున్నారు. జిల్లాలో మ రుగుదొడ్డి లేని ఇళ్లు లేదని లెక్కలు చూపి అధికారులు అవార్డులు పొం దారని…అప్పు చేసి మరుగుదొడ్లు నిర్మించుకున్న మాకు మాత్రం శఠగో పం పెట్టారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మనతెలంగాణ/జగిత్యాల: జగిత్యాల జిల్లాలో 18 మండలాలు, 330 గ్రామాలు ఉన్నాయి. జిల్లాలో 2,05135 గృహాలు ఉండగా జగిత్యాల జిల్లా ఏర్పడిన నాటికి 1,45,598 గృహాల్లో మాత్రమే మరుగుదొడ్లు ఉన్నట్లు అధికారులు లెక్కలు తేల్చారు. మిగతా 59,537 గృహాల్లో మరుగుదొడ్లు లేక వారంతా బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేస్తున్నట్లు గుర్తించారు. ప్రతి ఇంటా మరుగుదొడ్డి నిర్మించి జిల్లాను బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ శరత్ నిర్ణయించారు. ఈ మేరకు గ్రామాల్లో మరుగుదొడ్ల ఆవశ్యకతపై అవగాహన సదస్సులు నిర్వహించడంతో పాటు 100 రోజుల్లో వంద శాతం మరుగుదొడ్లు నిర్మాణం చేయాలని లక్షంగా పెట్టుకున్నారు. ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించడంతో పాటు గ్రామాలను సందర్శించి పనులను కలెక్టర్, సంబంధిత అధికారులు పర్యవేక్షించారు.

అధికారులు ఎందుకంత అత్యుత్సాహం చూపారో…?
జిల్లాలో నిర్మాణం కావాల్సిన 59,537 మరుగుదొడ్లకు గాను అధికారులు నిర్ణయించిన గడువులోగా 56,746 మరుగుదొడ్ల నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయి. అయితే 59,537 మరుగుదొడ్ల నిర్మాణాలకు పరిపాలన అనుమతి మంజూరు పొందడంతో నిర్మాణాలు పూర్తి కాని వాటిని కూడా పూర్తయినట్లు పేర్కొంటూ ప్రభుత్వానికి అధికారులు లెక్కలు చూపినట్లు తెలుస్తోంది. జిల్లాను బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా ప్రకటించుకోవడంతో కేంద్రం జగిత్యాల జిల్లాను స్వచ్చ భారత్ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ ఢిల్లీలో కేంద్ర మంత్రుల చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. నిర్ణీత గడువులో పూర్తి చేసుకున్న 56,746 మంది లబ్దిదారులకు బిల్లుల చెల్లింపులు జరగగా గడువు తర్వాత నిర్మాణాలు పూర్తి చేసుకున్న 2791 మరుగుదొడ్ల బిల్లులకు తోడు ఆ తర్వాత నిర్మించుకున్న మరో 3 వేల మరుగుదొడ్లకు బిల్లులు చెల్లించాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే జిల్లాలో సుమారు 10 వేల కంటే పైగా మరుగుదొడ్ల బిల్లుల చెల్లింపు జరగలేదని, అప్పు సప్పు చేసి మరుగుదొడ్లు నిర్మించుకున్న వారు బిల్లుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారంటూ సిఎల్‌పి ఉపనేత తాటిపర్తి జీవన్‌రెడ్డి విలేకరుల సమావేశాల్లో పలుమార్లు పేర్కొన్నారు. అధికారులు అత్యుత్సాహం చూపడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని, నిర్మాణాలు పూర్తి కాకుండానే, బిల్లులు చెల్లింపులు జరపకుండానే వంద శాతం పూర్తయినట్లు ఎలా ప్రకటించుకున్నారని ప్రశ్నించారు. మరుగుదొడ్లు కట్టుకున్న వారికి బిల్లులు చెల్లించకుండా మీరు మాత్రం అవార్డు పొంది సంతోషంగా ఉంటే సరిపోతుందా అంటూ ఆయన మండిపడ్డారు.

అధికారుల నిర్వాకంతోనే బిల్లులు పెండింగ్..?
అధికారుల నిర్వాకం వల్లే జిల్లాలో వేలాది మరుగుదొడ్లకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం జరిగిందని, బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా ప్రకటించుకున్నామని అధికారుల నివేదికలతో ప్రభుత్వం జిల్లాను స్వచ్చ జిల్లాగా గుర్తించింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్‌కు స్వచ్చ భారత్ అవార్డు అందించి సత్కరించింది. జిల్లాలో మరుగుదొడ్లు వంద శాతం పూర్తి అయినట్లు అధికారులు లెక్కలు చూపడం వల్ల ఆన్‌లైన్‌లో సైట్ క్లోజ్ చేసినట్లు తెలుస్తోంది. దాంతో బిల్లులు రావాల్సిన మరుగుదొడ్లకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో పడ్డాయి. మరుగుదొడ్ల బిల్లులు రావాలంటే ఆన్‌లైన్‌లో లబ్దిదారుల పేర్లు, ఆధార్ నెంబర్లు నమోదు చేయాల్సి ఉంటుంది. నిర్మించుకున్న మరుగుదొడ్ల ఫోటోలు తీసి జియో ట్యాగింగ్ చేసిన తర్వాతే బిల్లుల చెల్లింపు జరుగుతుంది. అయితే ఆన్‌లైన్‌లో సైట్ క్లోజ్ కావడంతో మరుగుదొడ్లు నిర్మించుకున్న వారికి బిల్లుల చెల్లింపు జరగడం లేదు. తమకు బిల్లులు చెల్లించాలని మరుగుదొడ్లు నిర్మించుకున్న వారు కార్యాలయాల చుట్టూ తిరుగుతుండగా, ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఇంత వరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో లబ్దిదారులు బిల్లులు వస్తాయా… లేదోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం మరుగుదొడ్ల పెండింగ్ బిల్లుల చెల్లింపు కోసం చర్యలు చేపట్టాలని లబ్దిదారులు కోరుతున్నారు.

Comments

comments