Home కుమ్రం భీం ఆసిఫాబాద్ భక్తుల కొంగుబంగారం బెజ్జూరు శ్రీరంగనాథుడు

భక్తుల కొంగుబంగారం బెజ్జూరు శ్రీరంగనాథుడు

Sri-Ranganadhaswamy-Temple– నేటి నుంచి 3రోజుల పాటు జాతర ఉత్సవాలు
– నేడు మహా శివరాత్రి జాతర
మనతెలంగాణ/బెజ్జూర్: కోమురంభీం జిల్లా బెజ్జూర్ మండలంలోని శ్రీరంగనాయక ఆలయ ప్రాంగణంలో శివాలయం, శ్రీఆంజనేయ స్వామి, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయాలు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్తాబు అయ్యాయి. ఈ శివాలయంలో శివుడు ఎంతో మహిమకలవడని ఇక్కడ మొక్కులు తీర్చుకొని కోరికలు కోరుకుంటే తీరుతాయని భక్తుల గట్టి నమ్మకం. ప్రతి ఏడాది లాగానే శివరాత్రి సందర్భంగా మూ డు రోజుల పాటు ఆలయంలో శివరాత్రి జాతర కొనసా గుతుంది.24,25తేదీలలో జాతర కొనసాగుతుంది. జాతర నిర్వాహణకు ఆలయా నిర్వాహణాధికారి బెనక్కి శ్యాంసుందర్,ఉపాధ్యక్షుడు జిల్లాల సుధాకర్‌గౌడ్ ఆధ్వర్యంలో జాతరకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వారు తెలిపారు.

ఆలయ చరిత్ర…
బెజ్జూర్ మండల కేంద్రంలో ఉన్న శివాలయం శ్రీరంగనా యకస్వామి ఆలయాలకు చుట్టురా రాతిస్తంబాలతో వేయి సంవత్సరాల చరిత్ర ఉన్నట్లు భక్తులు చెప్పుతుంటారు. గోండురాజులైనా బిజ్జుహేలినా ప్రాంతంగా బెజ్జూర్‌కు పేరుం ది. కాకతీయుల సామతరాజులుగా ఇక్కడ స్దావరాన్ని ఏ ర్పాటు చేసుకొని పాలించినట్లు ఆనవాలు చెప్పుతున్నాయి. సమాఖ్య ప్రభుత్వాల పాలనలో ఇక్కడ గుర్జులు కోనేరు ఇ తరాత్ర నిర్మాణాలు శిథిలామైపోయ్యాయి.గతంలో విజ్జూర్ గా పిలుచుకున్న గ్రామం. కాలక్రమణగా బెజ్జూర్‌గా మా రింది. రాత్రి సమ యంలో ఆలయంలోకి వెళ్లాడు. ఆలయ ప్రాంగణం చుట్టు కొన్ని రోజులుగా తిరుగడంతో హఠా త్తుగా స్వామి వారి కృపాతో మంచివాడిగా మారి తన సొంత ఇంటికి వెళ్ళిపోయాడు. అంతేకాకుండా బెజ్జూర్‌లో లీలాబాయ్, శివాజీ, గౌస్‌బాబు ఇలా ఎందరో మతిస్దిమితంతో ఉన్న వారిని పరమేశ్వరుడు మహావిష్ణువుకృపాతో మంచివాడిగా మారిన చరిత్ర గల బెజ్జూర్ ఆలయాలు ఉన్నాయి.

దీంతో ప్రతి రోజు భక్తులు పూజకార్యక్రమాలు చే పడుతుంటారు. మహా శివరాత్రి రోజున కుటుంబ సమ్మే తంగా వచ్చి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శివరాత్రి సందర్భంగా మూడు రోజుల పాటు పెద్ద జాతర ఉత్సవాలు జరుగుతుంటాయి. ఉదయాన్నే శివుడికి దర్శ నం,ప్రార్ధన అభిషేకంతో పాటుమహా దర్శనం,సాయంత్రం శివపార్వతి కల్యాణం కన్నులపండుగగా నిర్వహిస్తారు. ఈప్రాంతంలో అది పెద్ద జాతర కావడంతో బెజ్జూర్ మ ండలంతో పాటు నియోజకవర్గంలో సిర్పూర్‌కాగజ్‌నగర్, ఆసిఫాబాద్,కౌటాల,మహారాష్ట్ర వివిధ మండలాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి దైవ దర్శనం చేసుకుంటారు. శివాలయం చుట్టు పురాతన దేవతల విగ్రహాలు ఉన్నాయి. శివాలయం చుట్టు దేవతల ఆలయాలు,విగ్రహాలు బెజ్జూర్ శివాలయంలో శివలింగం రంగరమేశ్వరి,వినాయకుడు, నందీశ్వరుడి విగ్రహం,శ్రీఆంజనేయ ఆలయంలో,శ్రీరంగ నాయక ఆలయం, శ్రీవెంకటేశ్వరస్వామి, వీరబ్రహ్మేంద్ర స్వామి,లక్ష్మి ఆలయంలో చుట్టురా రాతి స్తంబాలతో పు రాతన ఆలయాలు ఉన్నాయి.

వాంకిడిలో…
మండలంలోని వాంకిడి శివకేశవాలయంలో శుక్రవారం నుంచి నిర్వహించే మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబై యింది. జిల్లాలోనే అతిపెద్ద ప్రసిద్ధి చెందిన వాంకిడి శివ కేశవాలయం చికిలివాగు ఒడ్డున వెలిసిన ఈ ఆలయానికి ప్రత్యేక చరిత్ర ఉంది. నిజాం కాలంలో ఝాన్సీ లక్ష్మిదేవి యాదవ రాజును యుద్దంలో ఓడించి నందున దానికి ప్ర తికగా ఇక్కడ ఆలయం నిర్మించినట్టు స్దానికులు చెప్తారు. మూడు గోపురాలు ఉన్న ఈ ఆలయంలో శివకేశవుడు ఉం డటం ప్రత్యేకం అని స్దానికులు తెలుపుకుంటారు. గర్భగు డిలో శివుడు కొలువుదీరి ఉండగా కుడివైపు విష్ణుమూర్తి, ఎడమవైపు ఎల్లమ్మ మహంకాళి రూపంలో కొలువుదీరి ఉన్నాయి. ఆలయం బయట వినాయకుడు,ఆంజనేయు డు,నవగ్రహలు ఉన్నాయి. గుడిగోడల పై కళాకారులు చె క్కిన పురాతన శిల్పలు అందరిని ఆకట్టుకునేలా ఉన్నాయి.

నేడు జాతర…
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం నుంచి నిర్వహించనున్న జాతర,మహాశివరాత్రి ఉత్సవాల కు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.ఆలయ కమిటి ఆధ్వర్యంలో ఆలయానికి వివిధ రంగులు,విద్యుత్ దీపాలతో అలక రించారు. జాతర సందర్భంగా ఇప్పటికేపెద్ద ఎత్తున దు కాణాలు వెలిశాయి. జాతరకు వాంకిడి మండల కేంద్రంతో పాటు పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద సం ఖ్యలో తరలివచ్చి స్వామివారని దర్శించుకుంటారు.

ముథోల్‌లో…
మహాశివరాత్రి పండుగాను పురస్కరించుకోని మండలం కేంద్రంలోని స్థానిక బస్టాండ్ సమీపాన గల శ్రీపశుప తినాథ్ ఆలయంలో శివలింగాన్ని భక్తులు దర్శించుకోను న్నారు. శివరాత్రికి ఆలయ కమీటి ఆద్వర్యంలో ముస్తాబు చేశారు. అన్ని శుద్దిపరిచి రంగులను వేసి సగర్వంగా సుం దరంగా తీర్చిదిద్దారు. ఈ ఆలయానికి మండల కేంద్రంతో పాటు వివిధ చూట్టు పక్కల మండలాలైన తానూర్, లోకేశ్వర్, బైంసా, కుబీర్, బాసర మండలాల నుండి కాకు ండా పక్కరాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి భక్తులు వచ్చి మొ క్కులను తీర్చుకుంటారు. వచ్చిన భక్తులకు చైతన్యయూత్ ఆధ్వర్యంలో ప్రసాదాల సేవలను చేయనున్నా. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను చేసి నట్లు ఆలయ కమీటి నిర్వహకులు తెలిపారు.

జైపూర్‌లో…
మహాశివరాత్రిని పురష్కరించుకొని జిల్లాలో ప్రసిద్ది గాం చిన వేలాల జాతర ముస్తాబైయింది. యాదవుల ఆరాధ్య దైవమైన మల్లీఖార్జునుడు వేలాల గ్రామంలో ఉండడంతో భక్తులు లక్షలాది మంది తరలిరానున్నారు. ప్రతి యేటా మహాశివరాత్రి సందర్భంగా నాలుగు రో జుల పాటు రం గరంగ వైభవంగా జాతర జరుగుతుంది. జైపూర్ మండ లంలోని గోదావరి తీరంలో గల వేలాల గ్రామంలో 200 సంవత్సరాల క్రితం ఆలయం ఏర్పడిందని చరిత్ర కారులు చెప్పుకుంటారు. మహాశివరాత్రిని పురష్కరించుకొని నేడు వేలాల సమీపంలో గల గుట్టపై జాతర జరగనుంది. గృహ లో గల శివలింగాన్ని లక్షలాది మంది భక్తులు ధరించు కొని మొక్కలు తీర్చుకుంటారు. ఈ జాతరలో ప్రత్యేకంగా శివశక్తు పూనకాలతో డమరుఖం ధ్వనుల మధ్య జాతర ఎంతో ఉత్సహంగా జరుగుతుంది. ఒడ్డు పూజారులు శివ లింగానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భక్తులు మళ్లి ఖార్జునికి పట్నాలు వేసి మొక్కులు తీర్చుకుంటారు. గు హలో గల శివలింగాన్ని దర్శించుకొని పాడిపంటలు, సం సారం సౌభగ్యాలతో పాటు శుభాలు కలుగుతాయని భ క్తుల ప్రగాఢ నమ్మకం కోరిన కో ర్కెలు తీర్చే మల్లీఖార్జున్ని దర్శించుకోవడానికి మన జిల్లాలోనే భక్తులే కాకుండా కొ మురంభీం, ఆదిలాబాద్, నిర్మల్, వరంగల్, భూపాల్‌పల్లి, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలతో పాటు మహారాష్ట్రంలోని చి రోచ్చ, గడ్చిరోలి ప్రాంతాల నుంచి దాదాపు 4 లక్షల భ క్తులు రానున్నారు. జాతరకు వేలాల గ్రామాన్ని సర్వంగ సుందరంగా ముస్తాబు చేశారు. భక్తులకు ఉచిత తాగునీటి సౌకర్యం, వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలో బారిగేట్లను ఏర్పాటు చేశారు.

నేడు శివపార్వతుల కల్యాణం
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నేడు శివ పార్వతుల కల్యాణ మహోత్సవాన్ని అధికారికంగా నిర్వ హించనున్నారు. కల్యాణం కోసం దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేశారు.

జాతర ఏర్పట్లను పరిశీలించిన అధికారులు
వేలాల జాతర ఏర్పట్లను గురువారం జైపూర్ తహసీల్దార్ జ్యోతి,జైపూర్ ఎస్‌ఐ సంజీవ్‌లు ఏర్పట్లను పరిశీలించారు. తాగునీరు, వైద్యం, వీధి దీపాలు, అధికారులు ఏర్పాట్లు చే సిన ఏర్పట్లును పరిశీలించారు.

ఆసిఫాబాద్‌లో..
మహాశివరాత్రినిపురస్కరించుకొని జిల్లాకేంద్రంలో శివాల యాలు ముస్తాబు అయ్యాయి. కాగజ్‌నగర్ మండలంలోని ఈజ్గం శివాలయం,రెబ్బెన మండలంలోని నంబాల శి వాలయం,వాంకిడి మండలంలోని శివాలయం అలాగే ఆసిఫాబాద్ మండలంలోని చిర్రకుంట,గుండి గ్రామ శివాలయాలు అన్ని అంగుళాలతో లైటింగ్‌లతో ముస్తాబు అయ్యాయి. శుక్రవారం ఉదయం వేదపండితులచే అఖండ దీపారాధన,గణపతిపూజ,నవగ్రహపూజ,శివపార్వతుల కళ్యాణం అనంతరం రథోత్సవాలు జరుగుతున్నట్లు ఆల య కమిటీ నిర్వాహకులు పేర్కోన్నారు.

నేటి నుంచి బాసరలో శివరాత్రి ఉత్సవాలు
ఏర్పాట్లను పూర్తి చేసిన ఆలయాధికారులు
మనతెలంగాణ/బాసర: నేటి మహాశివరాత్రి వేడుకలు భాసర క్షేత్రంలో గోదావరి నదితీరానగల శివాలయంలో మూ డు రోజులపాటు ఉత్సవాలను జరపను న్నట్లు ఆల యాధికారి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. శుక్ర వారం మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకోని భ క్తులు తమ మొక్కులను తీర్చు కోవ డానికి మహారాష్ట్ర నుండి భారీ సంఖ్యరానున్నట్లు ఆయన తెలిపారు. అదే వి ధంగా సుదూర ప్రాంతాల నుండి ఎక్కువ సంఖ్యలోభక్తులు తరలి వస్తారని ఈ నేపథ్యంలో గోదావరి ఘాట్ వద్ద భ క్తులకు ఎలాంటి అవాంచనీయ సంఘటనాలు జ రగ కుండా గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశమని భక్తుల సౌక ర్యర్థం భైంసా, నిర్మల్,ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామా బాద్,హైదరబాద్, మహారాష్ట్ర తదితర డిపోల ప్రత్యేక బ స్సులు నడపనున్నట్లు అదేవిధంగా భక్తులకు ఆరోగ్యశిబిf రాలను ఏర్పాటు చేశామన్నారు.మహాశివరాత్రిని పుర స్కరించుకోని నదిఓడ్డున శివాలయంలో బిల్వార్చన ,అభి షేకం, కుంకుమార్చన ప్రత్యేక పూజలను నిర్వ హించను న్నట్లు ఆలయాధికారులు తెలిపారు.