Home నాగర్ కర్నూల్ మాది చేతల ప్రభుత్వం

మాది చేతల ప్రభుత్వం

The farmers are happy with the farmers' scheme

అన్నదాత మది నిండా సంతోషం
రైతులు ఇక అప్పులు చేయాల్సిన పనిలేదు
గత ప్రభుత్వాల వల్లే రైతాంగం ఆగమైంది
రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

మన తెలంగాణ/కొల్లాపూర్: మండల పరిధిలోని నర్సింగరావుపల్లి గ్రామంలో 243 చింతలపల్లి గ్రామంలో 1124 చెక్కులును రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం పంపిణీ చేశారు. ఈసందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రైతు బంధు పథకంతో రైతుల మదినిండా సంతోషం ఉందన్నారు. నాడు కొంత మంది నాయకులు వ్యవసాయం దండుగా అన్నారని, వ్యవసాయం దండుగ కాదు పండుగా అని తెలంగాణ ప్రభుత్వం నిరూపించిందన్నారు. గత ప్రభుత్వాల వైఖరి వల్లే రైతులు ఆగమైయ్యారని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఆయన తర్వాత ప్రతి సెంటుగుంటకు సాగునీరు, ఇంటింటికి తాగునీరు, మిషన్‌కాకతీయలో చెరువుల పూడిక తీతా, రైతులకు 5లక్షల ఉచిత భీమా, ఇలా అనేక సంక్షేమ పథకాలతో రైతులకు మార్గదర్శనం చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు. రైతుల పాలిట దేవుడు సిఎం అన్నారు. భారతదేశంలో ఏరాష్ట్రం చేయాని ఈపథకం తెలంగాణ ప్రభుత్వం పెట్టిందన్నారు. ఈకార్యక్రమంలో ఎంపిపి చిన్న నిరంజన్‌రావు, జడ్‌పిటిసి హన్మంత్‌నాయక్, కొల్లాపూర్ సింగిల్‌విండొ అధ్యక్షులు జూపల్లి రఘుపతిరావు,తహశీల్దార్ సరస్వతి,వ్యవసాయశాఖ అధికారి నాగరాజు, మాజీ ఎంపిపి నరేందర్‌రెడ్డి, మంత్రి వ్యక్తిగత కార్యదర్శి జూపల్లి వెంకటరామారావు, గ్రామ సర్పంచ్ విజయమ్మ, మాజీ ఎంపిటిసి పాండు, టిఆర్‌ఎస్ నాయకులు నరసింహ్మరావు, బోరెల్లి మహేష్, రహీంపాష, పస్పుల నరసింహ్మ తదితరులు పాల్గొన్నారు.