Home మహబూబ్‌నగర్ రైతు కళ్లల్లో ఆనందమే ప్రభుత్వ లక్ష్యం

రైతు కళ్లల్లో ఆనందమే ప్రభుత్వ లక్ష్యం

The farmers bias in the world are KCR

ప్రపంచంలోనే రైతు పక్షపాతి కెసిఆర్
రైతుకు భరోసా కల్పించిన ముఖ్యమంత్రి
రైతు ఆత్మగౌరవంతో జీవించాలన్నదే ప్రభుత్వ లక్షం
రైతు కోసం అధిక బడ్జెట్ కేటాయించింది దేశంలో మనదే మొదటి స్థానం
ఆగస్టు 15 నుంచి రైతు బీమా పథకం అమలు
రైతు కళ్లల్లో అనందం చూస్తున్నాం
సఖ్యతతో ముందుకు వెళ్తే రైతుదే రాజ్యం
రైతు సమన్వయ సమితి అవగాహన సదస్సులో మ్రంతి పోచారం, మంత్రులు లకా్ష్మరెడ్డి, జూపల్లి

మన తెలంగాణ/ మహబూబ్‌నగర్ : ప్రపంచంలోనే రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి రైతు పక్షపాతిగా నిలిచిన ఏకైక ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మ్రంతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రైతు బిడ్డగా, వ్యవసాయం తెలిసిన ముఖ్యమ్రంతిగా ఉన్న కెసిఆర్ నిరంతరం రైతుల గురించే ఆలోచించి, వారి కళ్లల్లో నీళ్లు  కాదు ఆనందం ఉండాలన్న మహా సంకల్పంతో అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కిందని తెలిపారు. దేశంలోనే కాదు,ప్రపంచ స్థాయిలో ఈ రోజు రైతు కోసం చేస్తున్న పథకాలపై అన్ని దేశాలు, రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని వైట్‌హౌస్ ఫంక్షన్ హాల్లో నాలుగు జిల్లాల  రైతు సమన్వయ సమితీల అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వ్యవసాయశాఖ మ్రంతి పోచారం మాట్లాడుతూ రాష్ట్రంలో 52 లక్షల 40 వేల మంది రైతులు ఉన్నారని, వారి వద్ద కోటీ 40 లక్షల ఎకరాల భూమి ఉందని, ఈ భూమి మొత్తానికి సాగునీరు కల్పించి రైతుకు అవసరమైన సహాయం చేయాలన్నదే ముఖ్యమ్రంతి కెసిఆర్ సంకల్పమని ఆయన అన్నారు. వ్యవసాయ రంగాన్ని లాభసాటి చేయాలన్న ఆలోచన,వ్యవసాయం దండగ కాదు, పండుగ అన్న సంకల్పంతో ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలిపారు. దేశానికి అన్నం పెట్టే రైతుకు ఒక సంఘం అంటూ లేకుండా పోయిందని కాని తెలంగాణాలో రైతు సమన్వయ సమితీల ఆధ్వర్యంలో లక్షన్నర రైతులు సంఘటితమయ్యారని పేర్కొన్నారు. వ్యవసాయ యాంత్రీకరణలో బాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది 10 వేల ట్రాక్టర్లను రూ. 500 కోట్లతో సరఫరా చేశామని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో కోత యంత్రాలను రాయితీపై అందిస్తామని ఆయన చెప్పారు. ఈ దఫా లక్షల టన్నుల ఉత్పత్తులను కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర బడ్జెట్‌లో రూ. 50 వేల కోట్ల బడ్జెట్‌ను రైతులు, వ్యవసాయ రంగానికే కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌కు దక్కిందని మంత్రి పోచారం చెప్పారు. 1.25 లక్షల టన్నుల పంట ఉత్పత్తులు సాధించినట్లు గుర్తు చేశారు. గతంలో వ్యవసాయం చేయాలంటే రుణాల కోసం బ్యాంకులు చుట్టూ,షావుకార్లు చుట్టూ, తిరిగినా దక్కేవి కావని చెప్పారు. సరిపడు ఎరువులు,విత్తనాలు లభించేవి కావు.నకిలీ విత్తనాలు,నకిలీ మందులు, కరెంట్ కోతలు వంటి వాటితో రైతులు అనేక ఇబ్బందులకు గుర్యయారని చెప్పారు.రైతు బంధు పథకం కింద ఎకరాకు రూ. 4 వేలు చెల్లించిన ఘనత తమకే దక్కిందన్నారు. నవంబర్‌లో మరో రూ. 4 వేలు అందిస్తామని, ఇది ఇంతటితో ఆగదని ప్రతి ఏటా ఈ రైతుబంధు పథకం కొనసాగుతుందన్నారు. నేడు తెలంగాణా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 24 గంటల కరెంట్, సరిపడు విత్తనాలు, ఎరువులు, సాగునీరు వంటి వాటితో పాటు రైతుకు అవసరమైన రైతు బంధు పథకం వంటివాటితో రైతులకు భరోసా కల్పించిన ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వంకే దక్కిందన్నారు. భూమి రికార్టుల ప్రక్షాళన కూడా యద్దంలా ప్రభుత్వం చేపట్టిందన్నారు. దీంతో అనేక మంది పేదల భూముల వివాదాలు పరిష్కారం అయ్యాయని గుర్తు చేశారు. ఇలా రైతు సంక్షేమానికి ముఖ్యమ్రంతి అనేక పథకాలు రూపొందించారని గుర్తు చేశారు. తమ ముఖ్యమ్రంతి కెసిఆర్ రైతుల కన్నీళ్లను తుడిచేందుకు మమ్ముల్ని రైతుల దగ్గరికి పంపితే, అక్కడ కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ ఆపాయిట్‌మెంట్ కొరకు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని మంత్రి ఎద్దేవ చేశారు. రైతుకు భీమా పథకం ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. ఇన్సూరెన్స్ పథకంలో రూ. 50 చెల్లిస్తే భీమా కల్పించే వారని, మా ముఖ్యమ్రంతి ప్రతి రైతుకు రూ.2271 ఇన్సూరెన్స్‌కు కంపెనీకి చెల్లించేలా రూపొందించారన్నారు. రైతు ఎలా చనిపోయినా ఆ కుటుంబం వీధి పాలు కాకుడదన్న మహా సంకల్పంతో రైతు మరణిస్తే రూ. 5 లక్షలు పది రోజుల్లోగా చేరేలా జిఒలు జారీ చేశారన్నారు. పది రోజుల్లోగా మృతుని రైతు కుటుంబానికి భీమా చెక్కును అందించక పోతే సంబందిత ఉద్యోగి నుంచి రోజుకు రూ. 1000 జీతాల్లో కోత విధించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.రాష్ట్ర వ్యాప్తంగా రైతు భీమాకు రూ. 5730 కోట్లు జీవిత భీమా పథకానికి ప్రభుత్వం చెల్లిస్తోందని తెలిపారు. 18 సంవత్సరాలు నుంచి 59 సంవత్సరాల వరకు ఉన్న ప్రతి రైతు ఈ పథకాన్ని సద్వనియోగం చేసుకోవాలని సూచించారు. రైతుకు భీమా పథకం ప్రపంచంలో ఎక్కడా అమల్లో లేదని చెప్పారు. రాష్ట్రంలో కెసిఆర్ రైతాంగం చేపడుతున్న కార్యక్రమాలపై కేంద్ర ఆర్థిక మ్రంతి సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారని గుర్తు చేశారు.రైతు లేనిదే రాజ్యం లేదని అనేక మంది చెబుతున్నప్పటికి ఆచరణలో రైతు సంక్షేమానికి,వారి జీవితానికి భరోసా కల్పించి, రైతు ఆత్మగౌరవంతో తలెత్తకు తిరగాలన్న లక్షంలో ముఖ్యమ్రంతి పని చేస్తున్నారని చెప్పారు. రైతు భీమా పథకానికి సంబందించి అధికారులు,ఎమ్మెల్యేలు దగ్గరుండి చేర్చించి జూలై 15 లోగా డేటా పూర్తిగా నింపాలని, ఆగస్టు 15 నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుందని చెప్పారు. పంచాయితీరాజ్ శాఖ మంత్రి జూపల్లి భాష్కర్‌రావు మాట్లాడుతూ మహబూబ్‌నగర్ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నింటిని పూర్తి చేసి 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన ఘతన తమ ప్రభుత్వంకే దక్కిందన్నారు. తమ ప్రభుత్వం రైతులకు సాగునీరు అందించాలని కృషి చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ నేతలు కోర్టుల్లో కేసులు వేస్తే ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారని విమర్శించారు. గతంలో ఏ ప్రభుత్వం పాలమూరు గురించి పట్టించుకోలేదని టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీడు భూములు సైతం బంగారు భూములుగా మారాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధిని అడ్డుకోవడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. రైతు బంధు, రైతుబీమా, ఎరవులు, విత్తనాలు, వంటి అనేక పథకాలతో రైతుల షంక్షేమానికి తమ ప్రభుత్వం నిరంతరం అండగా ఉంటుందని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ మ్రంతి లకా్ష్మరెడ్డి మాట్లాడుతూ దేశంలోని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా ఇప్పడు మన ముఖ్యమ్రంతి చేపడుతున్న రైతు పథకాల వైపు చూస్తున్నారని చెప్పారు. కర్ణాటక ముఖ్యమంత్రి ఏకంగా మన పథకాలనే అమలు చేస్తున్నాడని పేర్కొన్నారు. రైతులకు కష్టాలు లేని వ్యవసాయ రంగాన్ని అభివృద్ది చేయాలన్న లక్షంతో ముఖ్యమంత్రి కెసిఆర్ ముందుకు సాగుతున్నాడని చెప్పారు.గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రైతు సంక్షేమానికి టిఆర్‌ఎస్ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత కల్పించి అందుకు తగ్గ పథకాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమన్వయ సమితీ అధ్యక్షులు ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎంపి జితేందర్‌రెడ్డి, ఢిల్లీ అధికార ప్రతినిధి మందాజగన్నాథం, రాష్ట్ర ప్రణాలిక సంఘం అధ్యక్షులు నిరంజన్‌రెడ్డి,జడ్‌పి చైర్మన్ భాస్కర్, కలెక్టర్ రొనాల్డ్ రోజ్, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, ఆలవెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, రాజేందర్‌రెడ్డి, గువ్వల బాలరాజ్, అంజయ్య యాదవ్, ఎంఎల్‌సి కూచికుళ్ల దామోదర్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు రాములు, తదితర తదితరులున్నారు.