Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

కొత్తవి సరే.. పాత వాటి సంగతేంటి..

The farmers is one side happy and Another side suffering with  the farmer's kin scheme

సిరికొండ: ప్రభుత్వం అట్టహాసంగా చేపట్టిన రైతు బంధు పథకంతో రైతులు ఒక పక్క సంతోషంగా ఉన్నా మరోపక్క అందోళనకు గురవుతున్నారు. గతంలో ఉన్నపాస్ పుస్తకాలను పలు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో కొందరు రైతులు తాకట్టు పెట్టి పంట రుణాలు పొందారు. మరికొంత మంది దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాలను పొందేటప్పుడు ఆధార్‌కార్డును లింక్ చేసి రుణాలు తీసుకున్నారు. ఆ రుణాలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే నూతన పాస్ పుస్తకాలు, చెక్కులు పంపిణీ చేస్తుండడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. నూతన పాస్ పుస్తకాలను బ్యాంకుల్లో కుదవ పెడితే రుణాలు ఇస్తారా.. అవసరం రీత్యా భూమిని అమ్ముకొవాలంటే కొత్త పాస్ పుస్తకం చెల్లుతుందా అనే సందిగ్ధంలో అన్నదాతలున్నారు. పాలకులు భవిష్యత్తు నిర్ణయం ప్రకటించక పోతే రైతులు గందరగోళ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడే పరిస్థితి నెలకోనుంది. తక్షణమే రైతుల అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Comments

comments