Search
Saturday 17 November 2018
  • :
  • :

ఉద్యమ నాయకుడు సిఎం కావడం మన అదృష్టం

The farmer's welfare With irrigation water

సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకే ప్రాధాన్యత
సాగునీటితోనే రైతు సంక్షేమం
విద్యా, వైద్య రంగానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న ముఖ్యమంత్రి
రంజాన్ కిట్ల పంపిణీ, మార్కెట్ యార్డులో రూ.1.09కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు
రాష్ట్ర పంచాయతీ రాజ్ మంత్రి జూపల్లి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లకా్ష్మరెడ్డి

మన తెలంగాణ/కల్వకుర్తి : ఉద్యమ నాయకుడు  కెసిఆర్ ముఖ్యమంత్రి కావడం మన అదృష్టమని, తెలంగాణ ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కెసిఆర్ ఏలుబడిలలో, సంక్షేమ అభివృద్ధి, విద్యా, వైద్య రంగాలతోపాటు రైతు సంక్షేమానికి సహకరిస్తూ  ప్రజా సంక్షేమమే పరమావధిగా పని చేస్తున్న ముఖ్యమంత్రికి మనమంతా అండగా ఉండి బంగారు తెలంగాణ సాధనకు కలిసి అడుగులు వేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ మంత్రి జూపల్లి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లకా్ష్మరెడ్డిలు అన్నారు. ఆదివారం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో రూ.కోటి 9 లక్షలతో జరిగిన, జరుగుతున్న వాటర్‌ట్యాంక్, ముఖద్వారం, షాపింగ్‌కాంప్లెక్స్‌లను ప్రారంభించారు.  అలాగే రూ.45 లక్షలతో నిర్మించబోయే మార్కెట్ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం మార్కెట్ ఆవరణలో చైర్మన్ విజితారెడ్డి ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన సమావేశంలో  మంత్రులతోపాటు ఎంఎల్‌సి కసిరెడ్డి నారాయణరెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఢిల్లీలో అధికార ప్రతినిధి మందజగన్నాథం, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, కిష్టారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యకర్శి, మాజీమంత్రి రాములు లు  పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చేపడుతున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్ర , దేశాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని, రైతు సంక్షేమమే దేశాభివృద్ధి అని ప్రజా సంక్షేమానికి అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టారన్నారు. 60 ఏళ్లలే లేని సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారన్నారు. సాగునీటితో వెనుకబడ్డ పాలమూ రు జిల్లా అభివృద్ధి చెందుతుందని, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులతోపాటు పాలమూరు ప్రాజెక్టుకు నిధులు వెచ్చించి ఇప్పటికే ఆరున్నర లక్షల ఎకరాకలు సాగునీరు అందిస్తున్నామని, మరో ఏడాదిలోగా ఏడున్నర లక్షల ఎకరాకలు సాగునీరు అందించి వలసల జిల్లా పేరును మారుస్తామన్నారు. రైతుబం ధు పథకం దేశంలో ఆదర్శమని, ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వసతుల అందించి సర్కారు ఆసుపత్రులే ప్రైవేట్‌గా ధీటుగా ఉన్నయని ప్రజల స్పందన వస్తోందన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ఉచిత వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయని, ప్రతి ఇంటిని పర్యటించి అంధత్వరహిత రాష్ట్రం కృషి చేస్తామన్నారు. అనంతరం మైనార్టీలకు రంజాన్ కిట్లు పంపిణీ చేసి, ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. కార్యక్రమంలో జడ్‌పిటిసి అశోక్‌రెడ్డి ,మండల పార్టీ అధ్యక్షులు విజయ్‌గౌడ్, టిఆర్‌ఎస్ నాయకులు బాలాజీ సింగ్, నాయకులు రమణారెడ్డి, ఎంపిపిలు, సర్పంచ్‌లు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments