Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

కత్తి పోట్లకు ఒకరి మృతి

The father of the stabbe in the hands of the son

లక్షెట్టిపేట: మే 22 న దౌడేపల్లి గ్రామంలో కొడుకు చేతిలో కత్తిపోట్లకు గురై తీవ్ర గాయాల పాలైన కునారపు మల్లేశం(60)  మంచిర్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్టు పట్టణ ఎస్సై ఆది మధుసుధన్‌రావు తెలిపారు. మృతునికి మొదటి భార్య చనిపోవడంతో రెండవ వివాహం చేసుకున్నాడన్నారు. మృతుని పేరు మీద ఉన్నటువంటి 36 గుంటల భూమిని రెండవ భార్య కుమారుడు కునారపు రాజశేఖర్ తన పేరు మీద చేయాలని అనడంతో మృతుడు ఇష్టపడలేదని అందుకు రాజశేఖర్ తండ్రిపై కక్ష పెట్టుకున్నాడన్నారు. భయంతో మృతుడు తన మొదటి భార్య కూతురు పాకాల రాజేశ్వరి వద్ద ఉంటున్న తరుణంలో కుమారుడు రాజశేఖర్ పథకం ప్రకారం తన మరో ఇద్దరు చింతపువ్వు వెంకటసాయి, రాజశేఖర్ అనే స్నేహితులతో వచ్చి కిరాణ కొట్టులో కూర్చున్న మల్లేశంపై కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేశారన్నారు. ఈ దాడిలో గాయపడ్డ మల్లేశంను లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఇక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడని మల్లేశంపై కత్తులతో దాడి చేసిన ఆయన కుమారునితో పాటు ఆయన స్నేహితులిద్దరిని అదుపులోకి తీసుకుని కోర్టులో హజరుపర్చినట్టు ఎస్సై పేర్కొన్నారు.

Comments

comments