Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

బాలుడిని నేలకేసి కొట్టిన తండ్రి!

The father who was thrown his Son on the Wall

హైదరాబాద్/షాపూర్‌నగర్: భార్యా భర్తల మధ్య తలెత్తిన వివాదంలో కుమారుడికి తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్ళిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్టకు చెందిన శివ గౌడ్ స్థ్దానికంగా ఆటోడ్రైవర్‌గా పనిచేస్తుంటాడు.ఇతనికి భార్యా ముగ్గురు పిల్లలు ఉన్నారు. గత కొంత కాలంగా శివ గౌడ్ మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నట్లు అనుమానం వ్యక్తం చేసి న భార్యా పలు మార్లు అతన్ని నిలదీసింది.ఈ విషయంలో ఇరువురి మధ్య తరుచూ వివాదాలు జరుగుతునే ఉన్నాయి.ఈ క్రమంలోఆదివారం ఇంటి వద్ద భార్యా భర్తలకు అర్దరాత్రి సమయంలో గొడవ జరిగింది.ఈ గొడవలో భర్త శివకుమార్ కోపంతో తమ చిన్నకుమారుడు(3)సంవత్సరాల రిత్విక్‌ను గాలిలో పైకి లేపి ఎదురుగా ఉన్న ఆటోకేసి కొట్టాడు. ఈ తరువాత నేలకేసి కొట్టగా అడ్డుకున్న స్థానికులు శివగౌడ్‌కుకు దేహశుద్ధ్ది చేసి జగద్గిరిగుట్ట పోలీసులకు అప్పగించారు.ఈ దాడిలో గాయపడిన బాలుడు రిత్విక్ అపస్మారక స్థ్దితిలోకి వెళ్లగా వెంటనే తల్లి స్థ్దానికుల సహాయంతో చికిత్స నిమిత్తం నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్త్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని జగద్గిరిగుట్ట సిఐ నర్సింహరెడ్డి వెల్లడించారు.ఈ ఘటనపై తమకు బాలుడి తల్లి ఎటువంటి ఫిర్యాదు ఇవ్వలేదని సుమొటో కేసు కింద ఛైల్డ్ కేర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2005, 75 జేజే యాక్ట్ ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్త్తున్నామని సిఐ వెల్లడించారు.

Comments

comments