Home తాజా వార్తలు నడిరోడ్డుపై దంపతుల మధ్య కోట్లాట!

నడిరోడ్డుపై దంపతుల మధ్య కోట్లాట!

The fighting between couple in Mehdipatnam

హైదరాబాద్: నగరంలోని మెహదీపట్నంలో సోమవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో నడిరోడ్డుపై భార్యభర్తల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ కలకలం రేపింది. అక్రమ సంబంధం పేరిట భార్యను భర్త అనుమానించడంతో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో కోపం పట్టలేక చేతిలో ఉన్న చిన్నారిని భార్య రోడ్డుపై పడేసింది. నాపై కోపం చిన్నారిపై ఎందుకంటూ భార్యపై భర్త చేయిచేసుకున్నాడు. అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు దంపతులిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం చిన్నారిని వారికి అప్పగించి అక్కడి నుంచి పంపించి వేశారు. ఈ సంఘటనతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.