Search
Monday 24 September 2018
  • :
  • :

బిసి ఓటర్ల తుది జాబితాను జూన్ 1న ప్రదర్శించాలి

bc-otarla-image
జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్

మనతెలంగాణ/కరీంనగర్‌ప్రతినిధి: గ్రామపంచాయతీలలో ఇంటింటి సర్వే చేసి వెనుకబడిన తరగతి కులాలకు చెందిన వారి ఓటర్ల తుది జాబితాను జూన్ 1న ప్రదర్శించాలని జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్‌అహ్మద్ అన్నారు. శుక్రవారం కలె క్టరేట్ సమావేశ మందిరంలో ఎంపిడిఒలు, పంచాయతీ కార్యదర్శులతో బిసి ఓటర్ల గుర్తింపు, పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుపై సమీక్షా సమావేశం నిర్వహించా రు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 18,19 తేదీలలో గ్రామాల్లో ఇంటింటి సర్వే చేసి ఓటరు జాబితాలో బిసి ఓటర్లను బ్లాక్ బాల్ పాయింట్ పె న్‌తోగుర్తించాలని గుర్తించిన బిసి ఓటర్ల జాబితాను మే 22న గ్రామపం చాయతీలలో ప్రదర్శించాలని కలెక్టర్ అదేశించారు. ప్రజల నుండి ఏమైనా అభ్య ంతరాలు ఉంటే మే 24, 25 తేదీలలో స్వీకరించి వారికి నోటీసులు జారీ చేయాలని సూచించా రు. మే 28 నుండి 30 వరకు ఎంపిడిఒ, తహసీల్దార్, ఇఓఆర్డీ ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించి అభ్యంతరాలపై చర్చించాలని అదేశించారు. ఆనంతరం బిసి ఓటర్ల తుది జాబితాను జూన్ 1న అన్ని గ్రామపంచాయతీల్లో ప్రదర్శించాలని కలెక్టర్ అదేశించారు. ఎన్నికల నియమావళిని అనుసరించి తూచా తప్పకుండా ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యుల్ ప్రకారం పనులు పూర్తి చేయాలని కలెక్టర్ అదేశించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఓటర్ల జాబితాను శాసనసభ నియోజకవర్గాల ఎన్నికలకు తయారుచేసిన ఓటరు జాబితానే ప్రమాణికంగా తీసుకోవాలని కలెక్టర్ అదేశించారు. సంబంధిత గ్రామపంచాయతీల్లో అదేజాబితాను వార్డుల వారీగా ఓటర్లను విభజించుకోవాలని సూచించారు. ఓటర్ల జాబితాలో మార్పులు కాని చేర్పులు కాని చేయకూడదని కలెక్టర్ అదేశించారు. అన్ని గ్రామపంచాయతీలలో పోలింగ్ స్టేషన్‌లకు ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ భవనాలు, సామూహిక భవనాలను ఎంపిక చేయాలని కలెక్టర్ అదేశించారు. పోలింగ్ స్టేషన్‌లలో విద్యుత్ సౌకర్యం, పటిష్టమైన భవనాలను గుర్తించి మే 24న ప్రదర్శించాలని తెలిపారు.ఈ పోలింగ్ స్టేషన్‌ల ఏర్పాట్లపై ప్రజలలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించి వాటిని పరిశీలించి తుది పొలింగ్‌స్టేషన్‌ల జాబితాను జూన్ 4న ప్రదర్శించాలని కలెక్టర్ అదేశించారు. ఎన్నికల సమయం అయినందున ఎంపిడిఒలు, ఇఓఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులు ప్రతిరోజు సాయంత్రం ఒక గంట ఎన్నికల పనులపై సమీక్షించుకోవాలని కలెక్టర్ అదేశించారు. ఎన్నికలకు సంబంధించి ప్రతిరోజు నివేదికలు సమర్పించాలని కలెక్టర్ ఎంపిడివోలను అదేశించారు.

పంచాయతీ కార్యదర్శులకు సెలవులు మంజూరు చేయవద్దు
గ్రామపంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్నందున ఎన్నికల పనులకు ఎలాంటి అంతరాయం కలుగకుండా ఉండేందుకు వీలుగా గ్రామపంచాయతీ కార్యదర్శులకు ఎలాంటి సెలవులు మంజూరు చేయకూడదని జిల్లా కలెక్టర్ ఎంపిడివోలను అదేశించారు. గ్రామపంచాయతీ కార్యదర్శులు ము ందస్తు అనుమతి లేకుండా సెలవులో వెళ్లినచో విధుల నుంచి సస్పెండ్ చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో మొక్కలు నాటుటకు వీలుగా సరిపోయే మొక్కలు పెంచు నర్సరీ ఏర్పాటు చేయుటకు గ్రామ పంచాయతీలో స్థలాన్ని గుర్తించాలని కలెక్టర్ అదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి అయేషామస్రత్‌ఖానం, జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు, జిల్లా పరిషత్ సి.ఇ.ఓ పద్మారాణి, ఎంపిడిఒలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments