Home జాతీయ వార్తలు పశ్చిమబెంగాల్‌లో చివరి దశ పోలింగ్

పశ్చిమబెంగాల్‌లో చివరి దశ పోలింగ్

voteకోల్‌కతా : పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల చివరిదశ పోలింగ్ గురువారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. ఆరో దశలో భాగంగా గురువాఉరం తూర్పు మిడ్నాపోర్, కూచ్ బిహార్ జిల్లాల్లోని 25 నియోజకవర్గాలకుపోలింగ్ జరుగుతోంది. 6,774 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సుమారు 50వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 25 నియోజకవర్గాల పరిధిలోని మొత్తం 170 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 58,04,019 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.