Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

పదిరోజుల్లో నివేదికలివ్వాలి

 The first district to finish farmers insurance is Siddipet

మన తెలంగాణ/గజ్వేల్ : రైతు వారీగా సాగు చేసిన పంటలు, విస్తీర్ణం వివరాలు పది రోజుల్లో నివేదికలు అంద చేయాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రాంరెడ్డి గజ్వేల్ రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక మండల రెవెన్యూ కార్యాలయంలో రెవె న్యూ వ్యవసాయ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వివిధ రెవెన్యూ అంశాలపై ఆయన మాట్లాడారు. రెవెన్యూ భూ ప్రక్షాళనలో భాగంగా ధరణి- పట్టా దారు పాసుపుస్తకాల సవరణలపై ఆయన సుదీర్ఘంగా సమీక్షించారు. మండలాల వారీగా రైతుబంధు, రైతుబీమా పథకాలపై వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా గజ్వేల్ మండలంలో పెండింగ్‌లో ఉన్న రెవన్యూ రికార్డులపై విఆర్వోలతో ఆరాతీసిన  ఆయన పంటల వారీగా వివరాలు సేకరించాలని ఆదేశించారు. దీనికి గాను రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో సమగ్ర నివేదికలు సిద్దం చేసి వాటిని వ్యవసాయ శాఖ వద్ద ఉన్న ట్యాబ్‌ల్లో అప్‌లోడ్ చేయాలన్నారు. మండలంలో పెండింగ్‌లో ఉన్న అన్ని రెవెన్యూ రికార్డుల సవరణ నాలుగు రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. తహశీల్‌దారు నిర్మల, రెవెన్యూ సిబ్బంది, విఆర్వోలు కలిసి తప్పులు లేకుండా రికార్డులను సవరణ చేయాలన్నారు. తహశీల్దారు కార్యాలయంలో రెవెన్యూ సిబ్బం ది, విఆర్వోలు,వ్యవసాయశాఖ ఎఇఒల హాజరు వివరాలు, వారి విధుల నిర్వహణపై ఎప్పటికప్పుడు తనకు సమాచారం ఇవ్వాలని ఈడిఎం ఆనంద్‌కు సూచించారు.
రైతు బీమా పూర్తి చేసిన తొలి జిల్లా సిద్దిపేట
రైతు శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం అమలులో రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లా మొదటి స్థానంలో ఉందని కలెక్టర్ వెంకట్రాంరెడ్డి ఈ సమావేశంలో చెప్పా రు. రైతు బీమా కల్పించటంలో సమర్థంగా పనిచేసిన జిల్లా వ్యవసా య శాఖ అధికారి శ్రవణ్‌కుమార్‌తో పాటు మండలాల ఎఒలు, ఎఇఒలు, మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా లో 2లక్షల17వేల826 మంది రైతుల కు రైతుబీమాకు నిర్దేశించిన గడువు జులై 5 లోపు పూర్తి చేశామన్నారు. ఇటీవల అదనంగా వచ్చిన 21.418 లక్షల పాసు పుస్తకాలను కలుపుకుని మొత్తం 2లక్షల 39వేల 286 మంది రైతులకు బీమా వర్తించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామాల వారిగా కొత్త పాసుపుస్తకాలు ప్రింట్ అయినట్లు ఆయన తెలిపారు. త్వరలోనే వాటిని పం పిణీ చేస్తామన్నారు. సమావేశంలో జెసి పద్మా

Comments

comments