Home అంతర్జాతీయ వార్తలు అంతరిక్షంలో  సుమబాల

అంతరిక్షంలో  సుమబాల

flowerవాషింగ్టన్ : గోరింటా పూసింది కొమ్మాలేకుండా అన్నట్లు అసలు ప్రాణి ఉందా లేదా అనే మీమాం సలు ఉన్న అంతరిక్షంలో తొలిసారి ఓ పువ్వు విర బూసింది. అచ్చం పొద్దు తిరుగుడు పువ్వులాగా నిండుగా విరబూసింది. అమెరికా అంతరిక్ష కేం ద్రం నాసా వారు తమ  అంతర్జాతీయ అంతరిక్ష స్థావరంలో (ఐఎస్‌ఎస్)లో రూపొంది ంచిన హరిత ప్రయోగశాలలో పుష్పించిన ఈ పువ్వుకు నాసా శాస్త్రజ్ఞులు ముచ్చటపడి ‘జిన్నియా’ అని పేరు పెట్టారు. అమెరికాలో జిన్నియా పూలు ఎక్కువగా విరబూస్తాయి. వీటిని సలాడ్‌లలో కలిపి అమెరికన్లు తింటుంటారు. వంటకాలలో జిన్నియా ఫోటోను నాసా శాస్త్రజ్ఞుడు స్కాట్ కెల్లీ తమ ట్విట్టర్‌లో పెట్టి, ప్రపంచానికి పరిచయం చేశారు. అంతరిక్ష కేంద్రంలోని తోటలో ఇప్పటికే కూరగాయలు పెంచుతున్నారు. ఈ పువ్వుతో ఇక అంతరిక్షంలో ఇతర జీవచరాలకు కూడా వీలుంటుందనే విషయం నిర్థారణకు వస్తోందని కెల్లీ పేర్కొన్నారు. గురుత్వాకర్షణ శక్తి లేని ప్రాంతంలో మొక్కలు ఎలా పెరుగుతాయి? అనే అంశాన్ని శాస్త్రజ్ఞులు పరిశోధించారు. రెండు సంవత్సరాల క్రితం స్పేస్ స్టేషన్‌లో హరిత కేంద్రాన్ని రూపొందించారు. పలు రకాల విత్తనాలను నాటి వాటిని సరైన రీతిలో పరిరక్షించడం ద్వారా కూరగాయలు పండించేందుకు కృషి సాగుతోంది. ఇందులో భాగంగా నాటిన పూల మొక్క ఇప్పుడు పుష్పించింది. జిన్నియా తొలి పుష్పాల మొక్క అని, ఇది అంతరిక్షంలో వాతావరణాన్ని తట్టుకుని విరబూయడం కీలక పరిణామం అని శాస్త్రజ్ఞులు హర్షం వ్యక్తం చేశారు. ఇక ముందు టమాటలు ఇతర మొక్కల పెంపకం కూడా జరుగుతుందని హరిత ప్రాజెక్టు నిర్వాహకులు ట్రెంట్ స్మిత్ తెలిపారు. మొక్కల పెంపకానికి శాస్త్రజ్ఞులు పలు రకాలుగా శాస్త్రీయ విధానాలు అవలంభించారు. ఎరుపు, నీలం, ఆకుపచ్చ ఎల్‌ఈడి లైట్లతో కాంతులను ప్రసరింపచేయడం ద్వారా సూర్యకాంతి ప్రభావాన్ని కల్గింపచేశారు. దీనితో జెన్నియా వంటి పూలు ఇప్పుడు విరబూయడానికి వీలేర్పడింది.