Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

ఖమ్మం, ఆసిఫాబాద్‌లకు డెల్టా ర్యాంకులు

niti

విడుదలైన నీతి ఆయోగ్ ర్యాంకుల తొలి జాబితా 

మన తెలంగాణ / హైదరాబాద్/ న్యూఢిల్లీ : నీతి ఆయోగ్ డెల్టా ర్యాంకుల కోసం దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 117 జిల్లాల్లో తెలంగాణ నుంచి ఖమ్మం, ఆసిఫాబాద్ జిల్లాలు టాప్ 15లో చోటు సంపాదించుకున్నాయి. విద్య, వైద్యం, వ్యవసా యం, సాగునీరు, ఆర్థికం, మౌలిక సదుపాయా లు, నైపుణ్యాభివృద్ధి తదితర అంశాల్లో ఏప్రిల్, మే నెలల్లో సాధించిన ప్రగతిపై 22 రాష్ట్రాల్లోని 117 జిల్లాల్లో నీతి ఆయోగ్, టాటా ట్రస్ట్‌లు, బిల్ గేట్స్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌లు సంయుక్తగా నిర్వహించిన పోటీల్లో అన్ని రంగాలను పరిగణనలోకి తీసుకుని ఇచ్చిన డెల్టా ర్యాంకుల్లో 11వ స్థానం లో ఖమ్మం, 15వ స్థానంలో ఆసిఫాబాద్ జిల్లాలు నిలిచాయి. వివిధ అంశాల్లో బాగా వెనకబడిన జిల్లాలకు ఆరోగ్యకరమైన పోటీ నిర్వహించి అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల ‘ఔత్సాహిక జిల్లాల పరివర్తన’ అనే పేరుతో పోటీలను నిర్వహించారు. ఏప్రిల్, మే నెలల్లో సాధించిన ప్రగతిని విశ్లేషించి ఏ జిల్లా ఏ రంగంలో ఎంత ప్రగతిని సాధించింది, అన్నింటికీ కలిపి సగటున ఏ స్థాయిలో నిలిచింది తదితర వివరాలను తొలి జాబితాగా నీతి ఆయోగ్ ఢిల్లీలో శుక్రవారం విడుదల చేసింది. మార్చి చివరి నాటికి 100వ స్థానంలో ఉన్న ఆసిఫాబాద్ జిల్లా ఈ రెండు నెలల్లోనే అభివృద్ధి సాధించి 15వ స్థానానికి చేరుకుంది. విద్య, వైద్యం, వ్యవసాయం తదితర విభాగాలను ఐదు అంశాలుగా కేటాయించి ఒక్కోదానికి నిర్దిష్టంగా ప్రశ్నావళిని రూపొందించి ఆయా జిల్లాలు సాధించిన ప్రగతికి అనుగుణంగా మార్కులు ఇవ్వడంతో గుజరాత్‌లోని దహోడా జిల్లా 19.8 మార్కులతో తొలి స్థానంలో నిలిచింది. ఖమ్మం జిల్లా 11.5 మార్కులు సాధించి 11వ స్థానంలో, ఆసిఫాబాద్ జిల్లా 10.8 మార్కులు సాధించి 15వ స్థానంలో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి విజయనగరం, కడప, విశాఖపట్నం జిల్లాలు 4, 5, 14 స్థానాల్లో నిలిచాయి. టాప్ 15లో ఏపీ నుంచి మూడు, తెలంగాణ నుంచి రెండు, తమిళనాడు, గుజరాత్‌ల నుంచి రెండు చొప్పున ఎంపికయ్యాయి. వ్యవసాయ రంగంలో మూడు మార్కులు సాధించి ఖమ్మం జిల్లా ఐదవ స్థానంలో నిలిచింది. ఇదే అంశంలో ఆసిఫాబాద్ జిల్లా మాత్రం ఆశించిన అభివృద్ధిని సాధించలేకపోవడంతో మైనస్ మార్కులతో 107వ స్థానానికి పడిపోయింది. జన్‌ధన్ యోజన, అటల్ పింఛను యోజన, ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన తదితర సామాజిక భద్రతా సంక్షేమ పథకాల అమలు, బ్యాంకు ఖాతాలను తెరవడం, రుణాల ద్వారా లబ్దిదారులకు చేయూతనివ్వడం తదితరాలతో భూపాలపల్లి జిల్లా (ఆర్థికంలో) ఐదవ స్థానంలో నిలిచింది.

Comments

comments