Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

ద్రవ్య లోటు లక్ష్యాన్ని చేరుకుంటాం

BS

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(201819) బడ్జెట్ అంచనాల కంటే ద్రవ్యలోటు మెరుగ్గా ఉండనుందని కేంద్ర తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు. తొలి రెండు నెలల్లోనే(ఏప్రిల్  మే) బడ్జెట్ అంచనాలో సగం కంటే పైగా లక్ష్యాన్ని చేకూరుందన్న అంచనాలతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ద్రవ్యలోటు లక్షం 3.3 శాతం లక్ష్యాన్ని చేరుకోవడమే కాదు, ఇది మరింత త్వరగా సాధిస్తామని అన్నారు. జిఎస్‌టి(వస్తు, సేవల పన్ను) వసూళ్లు పెరగనున్నాయని, వీటి మొత్తం ఆదాయం ఏడాది రూ.13 లక్షల కోట్లను దాటనుందని ధీమా వ్య క్తం చేశారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, దేశీయ బడ్జె ట్ ద్రవ్య లోటు రెండు నెలల్లో (ఏప్రిల్, మే) రూ.3.45 లక్షల కోట్లను చేరుకుంది. పూర్తి సంవత్సరం ద్రవ్యలోటు లక్షం రూ.6.24 లక్షల కోట్లతో పోలిస్తే ఇది సగానికి చేరుకుంది. ఎన్నికల సంవత్సరం నేపథ్యంలో 3.3 శాతం ద్రవ్యలోటు లక్షం దిశగా ప్రభుత్వ పనిచేస్తోందని అన్నారు. 201314 లేదా 2007  2009 సంవత్సరాల్లో చూస్తే ద్రవ్య లోటు, స్థూల ఆర్థిక స్థిరత్వం, సుపరిపాలనను రాజకీయ పార్టీలు గాలికి వదిలేశాయని గోయల్ విమర్శించారు. కాగా మే నెలతో పోలిస్తే  జూన్‌లో జిఎస్‌టి వసూళ్లు రూ.95,610 కోట్ల కు పెరిగాయని ప్రభుత్వం వెల్లడించింది.  నెలకు రూ. లక్షల కోట్ల జిఎస్‌టి వసూళ్లు స్థాయిని చేరుకుంటామని ఆర్థిక కార్యదర్శి హస్ముఖ్ అధియా ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో(201718) సగటు న నెలకు జిఎస్‌టి వసూళ్లు రూ.89,885 కోట్లు రాగా, జూలై నుంచి మార్చి మధ్య కాలంలో మొత్తం ఆదాయం రూ.7.41 లక్షల కోట్లుగా ఉంది. అయితే జూన్‌లో వచ్చి న మొత్తం జిఎస్‌టి వసూళ్లు రూ.95,610 కోట్లలో.. సి జిఎస్‌టి రూ.15,968 కోట్లు, ఎస్ జిఎస్‌టి రూ. 22,021 కోట్లు, ఇంకా ఐజిఎస్‌టి నుంచి రూ.49,498 కోట్లు(రూ.24,493 కోట్లు దిగుమతులపై వసూ ళ్లు) ఉన్నాయి. సెస్ నుంచి రూ. 8,122 కోట్లు వచ్చాయి. బోగస్ బిల్లులు జారీ చేయకపోతే వచ్చే నెలల్లో ఆదాయాలు మరింత పెరుగుతాయని అన్నారు.

Comments

comments