Search
Wednesday 18 July 2018
  • :
  • :

క్యూ1 ఫలితాలపైనే దృష్టి

bsns

 ద్రవ్యోల్బణం, క్రూడ్, రూపాయిలనూ గమనించాలి
 ఇన్వెస్టర్లకు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు

ముంబై: ఈ వారం స్టాక్‌మార్కెట్లకు క్యూ1(ఏప్రిల్‌జూన్) ఫలితాలు కీలకం కానున్నాయి. అలా గే, వినిమయ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం, పారిశ్రామిక ఉత్పత్తి వంటి స్థూల ఆర్థిక గణాంకాలు పరిశీలించాల్సి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ వారంలో భారీ సంస్థలు ఫలితాలు విడుదల కానున్నాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టిసిఎస్), ఇన్ఫోసిస్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ వంటి కంపెనీలు తొలి త్రైమాసిక ఫలితాలను ఆరంభించనున్నాయి. ఫలితాలు సానుకూలంగా ఉంటే మార్కెట్లు పాజిటివ్‌గా ఉండే అవకాశముంది. ఇంకా వినిమయ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం, పారిశ్రామిక ఉత్పత్తి, ట్రేడ్ బ్యాలెన్స్ డాటా వంటి వచ్చే వారాల్లో రానున్నాయి. క్రూడ్ ఆయిల్, రూపాయి కదలికలు కూడా మార్కెట్‌కు కీలకమేనని విశ్లేషకులు సూచిస్తున్నారు. అమెరికాచైనా మధ్య వాణిజ్య యుద్ధం పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలని వారు హెచ్చరిస్తున్నారు. 10,850 పాయింట్ల పైన నిఫ్టీ బ్రేక్ ఉంటుందని, సపోర్ట్ లెవెల్ 10,700 వద్ద ఉంటుందని ఈక్విటీ99 రీసెర్చ్ అనలిస్ట్ రాహుల్ శర్మ తెలిపారు.  ఈవారం ఐటి దిగ్గజం టిసిఎస్‌తో జూన్ త్రైమాసిక ఫలితాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 10న వెల్లడించనున్న ఫలితాల్లో టిసిఎస్ రెండంకెల స్థాయిలో వృద్ధిని నమోదు చేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతేడాది జూన్ త్రైమాసికంలో ఫలితాలు ఆశించినంతగా లేదు. అదే సమయంలో ఈసారి మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నారు. ఇంకా ఇండస్‌ఇండ్ బ్యాంకు కూడా 10వ తేదీనే ఫలితాలు ప్రకటించనుంది. ఆటోమొబైల్స్, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్‌ఎంసిజి, ఫార్మా తదితర రంగాల కంపెనీల నుంచి ఆశాజనక ఫలితాలు ఉండొచ్చని.. ఆదాయం, లాభాల్లోనూ రెండంకెల పెరుగుదల ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  అన్ని రకాల వాహన విభాగాల్లో స్థిరమైన అమ్మకాల వృద్ధితో ఆటోమొబైల్ కంపెనీలు మంచి ఫలితాలను ప్రకటించనున్నాయని భావిస్తున్నారు. ఏప్రిల్-జూన్ కాలంలో వాహనాల అమ్మకాలు 13-నుంచి 60 శాతం స్థాయిలో పెరిగాయి. బజాజ్ ఆటో, మారుతి సుజుకి, టాటా మోటార్స్ దేశీయ కార్యకలాపాలపై మంచి ఆదాయాన్ని నమోదు చేసే అవకాశం ఉంది. అలాగే విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుపైనా దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

Comments

comments