Home హైదరాబాద్ నగరం పావురాల కోట

నగరం పావురాల కోట

The following is the habitat of flyovers and metro pillars

భారీగా    పెరుగుతున్న కపోతాల సంఖ్య                                                                                                                ఫ్లైఓవర్లు, మెట్రో పిల్లర్ల కింది సందులే వాటి ఆవాసం 

మన తెలంగాణ/సిటీబ్యూరో : హైదరాబాద్ మహానగరంలో పావురాల సంఖ్య పెరిగిపోతోంది. గత నగరంలోని కొన్ని ప్రాంతాల్లోనే కనిపించే పావురాలు నేడు నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ మనకు దర్శనమిస్తున్నాయి. గతంలో నగరంలోని చెట్లు, అపార్ట్‌మెంట్ల పైన ఖాళీ ప్రాంతాలు, పురాతన భవనాల్లోనే పావురాలు తమ ఆవాసాలుగా ఏర్పరుచుకునేవి. కానీ ప్రస్తుతం నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఫ్లైఓవర్లు, మెట్రో పిల్లర్ల మ ధ్య భాగాలే వీటికి ఆవాసాలుగా మారాయి. గతంలో చెట్లు అధికంగా ఉన్న పాతబస్తీ, జూపార్క్, మదీనా, ఎంజెమార్కెట్, గుల్జార్‌హౌస్, చాంద్రాయణ్‌గుట్ట, సరూర్‌నగర్ చెరువు, గోల్గోండ, టౌలీచౌకీ పరిసరాల్లోనే పావురాలు ఎ క్కువ ఉండేవి. పాతబస్తీలో మదీనా సమీపంలోని ఓ ప్రా ంతంలో పావురాలు ఎక్కువగా ఉండటంతో ఆ ప్రాంతానికి కబూతర్‌ఖానాగా పేరొచ్చింది. కాలక్రమేణ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణం జరిగింది. మెట్రో రైలు కూడ అందుబాటులోకి వచ్చింది. మెట్రో రైలు రాకపోకలు సాగించడానికి నగరంలోని వివిధ ప్రాంతాల మీదుగా పెద్ద సంఖ్యలో పిల్లర్లను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి మెట్రో పిల్లర్ల మధ్య సందులను పావురాలు తమ అడ్డాలుగా మలుచుకున్నాయి. ఫిల్లర్ల పై భాగాలు ఎత్తున ఉండటంతో పావురాలు సేఫ్ జోన్‌గా వాటిని నివాసాలుగా మలుచుకున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో పావురాలు సంఖ్య పెరిగిపోయింది.

పావురాల దానాతో వ్యాపారం
హైదరాబాద్ వాసులు మొదటి నుంచి పక్షులను ప్రేమించేవారు. గతంలో ఇళ్లలో రామ చిలుకలను, రంగురంగుల పక్షులను పెంచేవారు. అలాగే పావురాలు అంటే కూడ నగరవాసులు ఎంతో ఇష్టం. పావురాలు ఆహారం(దానా) వేస్తే పుణ్యం వస్తుందని నగరవాసులు నమ్ముతారు. ప్రధానంగా కోఠి, కబూతర్‌ఖానా, పంజాగుట్ట, శివం రోడ్డు, ట్యాంక్‌బండ్ తదితర ప్రాంతాల్లో పావురాలు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తుంటాయి. దీంతో ప్రజలు అక్కడి వెళ్లి వాటిని ఆహారం వేస్తుంటారు. ఇదే అదనుగా కొంతమంది వ్యాపారులు ఆయా ప్రాంతాల్లో దుకాణాలు ఏర్పాటు చేసుకుని పావురాల ఆహారమైన జొన్నలు, చనిగెపప్పు, గోధుమలు, రాగులను అధిక ధరలకు అమ్ముతున్నారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో చనిగెపప్పు కిలో రూ.100, రాగులు కిలో రూ. 100, గోధుమలు కిలో రూ.50, అన్ని కలిపి మిక్స్‌డ్ రూ.300 వరకు అమ్ముతున్నారు. ధర ఎంతైనప్పటికీ పక్షుల ప్రేమికులైన నగరవాసులు దానాను కొని పావురాలకు వేస్తుంటారు. దీంతో ఇది వ్యాపారులకు లాభసాటిగా మారింది. ఇదిలా ఉండగా వర్షకాలం పావురాల నుంచి నగరవాసులు ఇబ్బంది పడుతున్నారు. వివిధ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో దర్శనమిస్తున్న పావురాలు వేస్తున్న రెట్ట (విసర్జకాలు) నుంచి తీవ్రమైన దుర్గంధం వెలువడుతోంది. దుర్గంధంతో ప్రజలు అవస్ధలు పడుతున్నారు. అదేవిధంగా పావురాలు విసర్జకాలలో బ్యాక్టేరియా ఉంటుందని, ఈ బ్యాక్టేరియా వలన ఆనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

‘కీమ్తీ ప్రేమ్ టవర్’
కోఠి హస్మత్‌గంజ్ ప్రాంతంలో దశాబ్ధాల క్రితం‘ప్రేమ’కు ప్రతి రూపంగా వెలసిన కీమ్తీ ప్రేమ్ టవర్ (కబూతర్ ఖనా) సందర్శకులను ఆహ్లాదం పంచుతుంది. వేలాది పావురాలు దర్శనమిచ్చే ఈ ప్రాంతానికి నగరవాసులు అధిక సంఖ్యలో వస్తుంటారు. నిజాం కాలంలో వెలిసిన ఈ కబూతర్ ఖానా ప్రేమకు చిహ్నంగా విరాజిల్లుతుంది. 1941లో కోఠి ప్రాంతలో నివాసం ఉన్న జమునాలాల్ రాంలాల్ కీమ్తీ తన భార్య ప్రేమబాయి మరణాంతరం ఆమె జ్ఞాపకాలకు చిహ్నంగా ‘కీమ్తీ ప్రేమ్ టవర్’గా దీన్ని ఏర్పాటు చేశారు. ప్రేమకు ప్రతిరూపంగా నిలిచే పావురాలు ఇక్కడ ఆశ్రయం పొందటం కోసం ఆయన ప్రత్యేకంగా టవర్‌ను నిర్మించారు. ఆనాటి నుంచి ఇక్కడ వేలాది పావురాలు ఆవాసముంటున్నాయి. ఉదయం సాయంత్రం వేళల్లో ప్రజలు ఇక్కడకు వచ్చి పావురాలకు, బియ్యం, జొన్నలు వేస్తుంటారు. ఈ ప్రాంతం చుట్టూ పార్కుగా తీర్చిదిద్దారు. దీంతో సందర్శకులకు పిక్‌నిక్ స్పాట్‌గా మారింది. కబూతర్ ఖానా సంరక్షణ కోసం స్ధానిక వ్యాపారులు కొందరు ‘పీజియన్స్ వేల్ఫేర్ అసోసియేషన్’ను ఏర్పాటు చేశారు. ఆనారోగ్యం, గాయాల బారిన పడే పావురాలకు వైద్యం చేసేందుకు ఇక్కడ ఓ వైద్యున్ని కూడ అందుబాటులో ఉంచారు.