Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

పునాది బలహీనం

The foundation is weak

పర్యవేక్షణతోనే సత్ఫలితాలు
వెనకబడిన అంశాలను గుర్తించాలి
విద్యార్థులు మెరుగయ్యేలా తీర్చిదిద్దాలి
పదిలో పరిస్థితి మారాలి
కనువిప్పు కలిగితేనే మేలు

మన తెలంగాణ/ఖమ్మం  విద్యావిభాగం : ఏదైనా ఒక భవనం కలకలం నిలవాలంటే దాని పునాది బలంగా ఉండాలి. ఇది విద్యా వ్యవస్థకు కూడా వర్తిస్తుంది. పై తరగతుల్లో విద్యార్థులు ప్రతిభ కనబర్చాలంటే కింది తరగతుల్లోనూ మంచి ప్రావీణ్యం సాధించడం అవసరం. ఎనిమిదో తరగతికి వచ్చినా లెక్కల్లో కనీసం చతుర్విద ప్రక్రియలు చేయలేని దుస్థితి. రోజూ మాట్లాడే మాతృభాషలోనూ పూర్తిగా పట్టు కోల్పోతున్నారు. గతేడాది జిల్లాల్లో మూడు నుంచి ఎనిమిది వరకు చదువుతున్న విద్యార్థులకు జాతీయ సాధన సర్వే ఫలితాలతో వెల్లడైంది. జిల్లాలో కనీస విద్యా ప్రమాణాలు లేవనే విషయం నిరూపితమైంది. పై తరగతులకు వచ్చిన విద్యార్థులకు ఆయా సబ్జెక్టులలో పట్టు సాధించడం లేదు. ఫలితంగా పది తరగతికి వచ్చే సరికి ఉత్తీర్ణత శా తం తీవ్రంగా పడిపోయేందుకు పునాది బలహీనం కారణంగా కన్పిస్తుంది. జాతీయ సాధన సర్వే ఫలితాలు జిల్లాలో చదువుల పరిస్థితి ఎలా ఉందో తెలియజేశాయి. వీటిని ఆధారంగా తీసుకుని విద్యాధికారులు, ఉపాధ్యాయులు సర్కారు బడుల్లో చదువులు బాగు చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించడం అవసరంగా కన్పిస్తుంది. ఎనిమిదో తరగతికి వచ్చిన విద్యార్థికి లెక్కలు రాకపోవడం వెనుక కారణాలు, మిగతా సబ్జెక్టుల్లోనూ ఎందుకు వెనుకబడుతున్నారు. వారికి ఎలా నేర్పిస్తే మెరుగవుతారో ముందుగా ఆలోచించాలి. ప్రాథమిక స్థాయిలో విద్యార్థులు అన్ని సబ్జెక్టుల్లో రాణించేలా బోధన చేయాల్సి ఉంటుంది. వారిపై ప్రత్యేక శ్రద్ద పెట్టి రోజు వారీగా వారి పరిస్థితులను గమనిస్తూ ఉండాలి. వారికి వచ్చిన సందేహాలను తీర్చడంతో పాటు సబ్జెక్టులలో రాణించేలా చేయాలి. ప్రస్తుతం ఎనిమిది, తొమ్మిది, పది తరగతులు చదువుతున్న విద్యార్థులు పదిలో సులువుగా ఉత్తీర్ణులు కావాలంటే ముందుగానే వారిని సిద్దం చేయడం ఉత్తమం. చదవడం, రాయడంతో పాటు సొంతంగా ఆలోచించి జవాబులు రాసేలా తర్ఫీదునివ్వాలి. పదో తరగతికి రాగానే వారు అన్ని సబ్జెక్టుల్లో రాణించేలా బోధన చేయడంతో పాటు ఉదయం, సాయంత్రం సమయాల్లోనూ ప్రత్యేక తరగతుల నిర్వహణ చేపట్టాలి. పాఠశాలల్లో చదువుల పరిస్థితి పై నిరంతర పర్యవేక్షణ సైతం అవసరం ఉంటుంది. ఉపాధ్యాయులు క్రమం తప్పకుండా బడికి వచ్చేలా చేయడంతో పాటు వారి బోధన తీరును సైతం గమనిస్తూ విద్యా వ్యవస్థను పటిష్టం చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది వచ్చిన పది ఫలితాలతోనైనా అధికారులు, ఉపాధ్యాయులకు కనువిప్పు కలగాల్సిన అవసరం ఉంది. గతంలో ఎన్నడు లేనివిధంగా ఉత్తీర్ణత 82.72 శాతానికే పరిమితం కావడం తీవ్ర అసంతృప్తిని మిగిల్చాయి. రాష్ట్రంలో, జిల్లాలో అన్ని జిల్లాల కన్న వెనుకబడ్డాయి. జిల్లాలో విద్యాబోధనతో పాటు విద్యార్థుల సామార్థాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇందులో అనేక మంది విద్యార్థులు గణితం, సామాన్యశాస్త్రం సబ్జెక్టులను దాటలేకపోయారు. పదేళ్ల పాటు ఈ సబ్జెక్టులను చదువుతున్న విద్యార్థులు పదిలో కనీసం ఉత్తీర్ణత మార్కులు సాధించలేకపోయారు. ఈ ఫలితాలను దృష్టిలో ఉంచుకుని రానున్న విద్యా సంవత్సరం ఉత్తీర్ణత మెరుగుపరిచేందుకు అందరూ కృషి చేయాల్సి అవసరం ఉంది.

Comments

comments