Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

నాలుగవ విడత హరితహారం

 The fourth installment is ready for the greenery program

మన తెలంగాణ/ సంగారెడ్డి ప్రతినిధి : నాల్గవ విడత హరితహారం కార్యక్రమానికి అంతా సిద్దం కావాలని రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. హరితహారం ఏర్పాట్లు, అర్బన్ పార్కులు తదితర అంశాలపై ఆయన మాట్లాడారు. వచ్చే నెల మొదటి, రెండో వారంలో నాల్గవ విడత హరితహారం ప్రారంభమవుతుందని చెప్పారు. పక్కా ప్రణాళికతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని తద్వారా పర్యావరణ పరిరక్షణలో ప్రభుత్వ ఆలోచనను అమలు చేయాలని సూచించారు. జిల్లాకు కేటాయించిన లక్షం మేరకు వివిధ శాఖలకు మొక్కలను పంపిణీ చేయాలన్నారు. ప్రత్యేకంగా రెండు కోట్ల ఈత మొక్కలను ఈ విడతలో నాటేందుకు లక్షంగా నిర్ణయించినట్లు తెలిపారు. అటవీ ప్రాంతాల్లో 50శాతం పండ్ల మొక్కలు నాటడానికి ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు. ఈతమొక్కలకు సంబంధించి ప్రణాళికలను సిద్దం చేసుకోవాలన్నారు. ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా ఈ పథకాన్ని విజయవంతం చేయవచ్చని పేర్కొన్నారు. జిల్లాల వారిగా అందుబాటులో ఉన్న మొక్కలు, నర్సరీలలో ఉన్న మొక్కల వివరాలు, నీటి లభ్యత, మొక్కల రక్షణకు ఫెన్సింగ్ తదితర అంశాలపై దృష్టిసారించాలని సూచించారు. అర్బన్ ఫారెస్ట్ పార్క్‌లను అభివృద్ది చేయడంలో భాగంగా ఆయా జిల్లాలలో గుర్తించిన బ్లాక్‌లలో వచ్చే నెల రెండోవారం నుంచి పనులు ప్రారంభం కావాలని చెప్పారు. సంగారెడ్డి జిల్లాలో మూడు ప్రాంతాల్లో అర్బన్ పార్క్‌ల అభివృద్ది పనులు నిర్ణీత సమయంలో ప్రారంభించేటట్లు చూడాలని కలెక్టర్‌కు సూచించారు. ఈ కాన్ఫరెన్స్‌లో ప్రిన్సిపల్ సీసీఎఫ్ పికే. ఝూ, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఎఫ్‌వో వెంకటేశ్వర్లు, డీపీవో వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments