Home వనపర్తి కాంగ్రెస్ భవిష్యత్ ప్రజలు నిర్ణయిస్తారు

కాంగ్రెస్ భవిష్యత్ ప్రజలు నిర్ణయిస్తారు

cong* డిసిసి జిల్లా అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్
మన తెలంగాణ/పాలమూరు: వంద ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు నిర్ణయించడానికి మీరేవరని,తమ భవిష్యత్తు ప్రజలే నిర్ణయి స్తారని డిసిసి జిల్లా అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో విలేకరలుతో ఆయన మాట్లాడుతూ ప్రజలు అవినీతిపై విసుగెత్తారని మా వైపు వచ్చేందుకు వెనుకాడరని ధీమా వ్యక్తం చేశారు. గత నాలుగేళ్లుగా కాంగ్రెస్‌ను విమర్శించడం తప్ప అభివృద్ధి లేదన్నారు. కెటిఆర్, హరీష్‌రావు లు పోటీ పడి జిల్లా పర్యటనలు చేస్తున్నారే తప్ప ప్రజల బాధలను విస్మరించారన్నారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు బెక్కరి అనిత ఆధ్వర్యంలో నూతనంగా జిల్లా మహిళా వైస్ ప్రసిడెంట్‌గా రేణుకను, జనరల్ సెక్రటరీగా బీసం వరలక్ష్మీలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ మహిళా కాంగ్రెస్ తరపున పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో సత్తూరు చంద్రకుమార్‌గౌడ్, ప్రచార కార్యదర్శి బెనహర్, నాగమణి, ఆలీ తదితరులు పాల్గొన్నారు.