Home మహబూబ్‌నగర్ ‘సుకన్య సమృద్ధి యోజన’

‘సుకన్య సమృద్ధి యోజన’

the-girl-parents-in-time-of-trouble-support

ఆడబిడ్డకు వరం.. ‘సుకన్య సమృద్ధి యోజన’

పోస్టాఫీసుల ద్వారా అమలు చేస్తున్న కేంద్రం
ఆడపిల్ల తల్లిదండ్రులకు ఆపద కాలంలో చేయూత
నిరుపేద బాలికలకు కొండంత అండ
బాలికల ఉన్నత విద్య, వివాహాలకు ఆర్థిక భరోసా

మన తెలంగాణ/మహబూబ్‌నగర్ : బాలికల భవిష్యత్‌ను ఉజ్వలంగా తీర్చిదిద్దేందుకు, ఆడబిడ్డలకు కొండంత అండను అందించి ఆపదకాలంలో ఆపన్నహస్తంగా నిలిచేందుకు దూర దృష్టితో ఆలోచన చేసి కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న పథకం సుకన్య  సమృద్ధి యోజక పథ కం. ఈ పథకం ద్వారా ఆడపిల్లల తండ్రులకు చేయూతనందించేందుకు ప్రభు త్వం కృషి చేస్తుంది. ఆడపిల్లల పెళ్లి చేయడం కోసం అప్పుల పాలవుతున్న తం డ్రుల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. నిరుపేద, మధ్య తరగతి కుటుంబాల్లో ఆడపిల్ల పుడితే నేటి అమ్మో అం టు జంకుతున్న పరిస్థితులు చాలానే ఉన్నాయి. ఆడబిడ్డ పుడితే ఆర్థిక భారంగా భావించే కుటుంబాలు చాలానే ఉన్నాయి. అలాంటి కుటుంబాలకు కొంతమేర ఉపశమనం కల్పించాలనే ఉద్దేశ్యంతో కేంద్రప్రభుత్వం ఆడపిల్లల భవిష్యత్‌ను ద ృష్టిలో పెట్టుకుని అనేక పథకాలను అమలు చేస్తుంది. ఇందులో భాగంగానే బేటీ పడావో-బేటీ బచావో అనే నినాదంతో సాంఘీక సంస్కరణకు తెర తీసింది. ఈ లక్షంతో మోడి ప్రభుత్వం చేపట్టిన పథకమే సుకన్య సమృద్ధి యోజన. ఆర్థికంగా ఎదడగానికి ఎవరికైనా పొదుపు అనేది చాలా ముఖ్యం. సంపాదించే సొమ్ములో కొంత పొదుపు చేసుకుంటే భవిష్యత్‌లో వచ్చే ఆపదకాలంలో సమస్యలను జయించడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నేటి ప్రపంచంలో అనేక బ్యాంకులతో పాటు పోస్టాఫీసుల్లో సైతం సేవింగ్ స్కీంలు చాలానే అందుబాటులో ఉన్నాయి. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం పోస్టాఫీసుల ద్వారా ఆడబిడ్డల సంక్షేమం కోసం సుకన్య సమృద్ధి యోజన అనే పొదుపు ఖాతా పథకాన్ని అందిస్తుంది. ఈ సుకన్య సమృద్ధి యోజన పథకం వివరాలను ఓసారి పరిశీలిస్తే..

సుకన్య సమృద్ధి యోజన పథకం అమలు విధానం
ఈ ఖాతాను ఇతర అకౌంట్లతో పోల్చకూడదు. సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని భారత ప్రభుత్వం 2015 సంవత్సరం జనవరి మాసంలో ప్రారంభించింది. ఈ ఖాతాను 10 సంవత్సరాల లోపు బాలికల కోసం, ఆ బాలిక తల్లిదండ్రులు నేచురల్ గార్డియన్‌తో ప్రారంభించవచ్చు. ఒకే అమ్మాయికి ఒకే ఖాతాను, తల్లిదండ్రులు గరిష్టంగా ఇద్దరు అమ్మాయిలకు ఖాతా తెరువచ్చు. కవల పిల్లల విషయంలో మూడవ అమ్మాయిపై ఖాతా తెరువవచ్చు. ఈ ఖాతాను భారతదేశంలోని ఏ పోస్టాఫీసులోనైనా తెరవవచ్చు. సంవత్సరానికి కనిష్టంగా రూ.1000లు జమ చేయాల్ని ఉంటుంది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో రూ.1000 నుంచి రూ.1.50 లక్షల వరకు జమ చేసే వీలు ఉంది. ఒక వేళ ఏ సంవ్సరంలోనైనా డబ్బులు జమ చేయలేకపోయినట్లతే ఏ విధమైన ఇబ్బంది లేదు. డబ్బులు చెల్లించని సంవత్సరంకు రూ.50 జరిమానతో జత చేసి బకాయి సొమ్మును జమ చేయవచ్చు. ఖాతాలో చెక్కు, నగదు, డిపాజిట్ డ్రాఫ్టును సంబంధిత తపాల శాఖ కార్యాలయ అధికారి పేరు మీద ఇవ్వాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల ఆర్థిక స్థితిగతులపైన ఈ ఖాతాను ప్రారంభించడమనేది ఉండదు. ధనిక, పేద తేడా లేకుండా ఎవరైనా తమ కుమార్తెల పేరు పైన జమ చేయవచ్చు. ఈ ఖాతాను ప్రారంభించిన నాటి నుంచి 14 సంవత్సరాల వరకు జమ చేయాలి. ఈ ఖాతా పరిమితి 21 సంవత్సరాలు. ఖాతా ప్రారంభించిన 15వ సంవత్సరం నుంచి ఖాతా మెచ్యూరిటీ అయ్యేంత వరకు ఏ విధమైన జమ చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే ఆ సంవత్సరాలకు వడ్డీ చెల్లిస్తుంది.

ఏ వయస్సుకు ఎంత వస్తుంది..
పాపకు 5 సంవత్సరాల వయస్సులో ఖాతాను తెరచామనుకోండి ఆ పాపకు 19 సంవత్సరాల వయస్సు వరకు డబ్బు జమ చేయాలి. ఆ తరువాత డబ్బు జమ చేయాల్సిన అవసరం ఉండదు. 26 సంవత్సరాలకు మేచ్యురిటీ ఆవుతుంది. నెలకు రూ.1000 చొప్పున సంవత్సరానికి రూ.12000 జమ అవుతుంది. 14 సంవత్సరాలకు రూ.1,68,000 లు జమ అవుతుంది. జమ అయిన సొమ్ముకు 8.3 శాతం వడ్డీతో రూ.3,74,119 లక్షలు వస్తాయి. అసలు+ వడ్డీ కలిపి రూ.5,42,119 లు సొమ్ము వస్తుంది.

ఖాతా తెరవడం ఇలా..
పాప పుట్టిన ధృవపత్రం, రెండు పాసు పోటోలు, సంరక్షకుని పోటోలతోపాటు దరఖాస్తును పూర్తి చేయాలి. భారత దేశంలో నివసించేవారికే ఈ పథకం వర్తిస్తుంది. సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో జమ చేసే సొమ్ముపైన ఖాతాలో వచ్చే డబ్బుకు, ఖాతా నుంచి విత్‌డ్రా చేసుకునే సొమ్ముకు సెక్షన్ 8సీ ప్రకారం ఇన్‌కం ట్యాక్స్ ఉండదు. ఈ ఖాతాలోని సొమ్మును బాలిక ఉన్నతవిద్యకు, వివాహానికి విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఏ ఇతర కారణాలతో సొమ్మును విత్‌డ్రా చేసుకునే అవకాశం లేదు. బాలికకు 18 సంవత్సరాలు నిండిన తరువాత బాలిక ఉన్నత విద్య కోసం ఖాతా సొమ్ము నుంచి 50 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం దేశ బాలికలకు బంగారు భవిష్యత్‌ను అందించేందుకు వరంగా భావించవచ్చు. ఆడపిల్లల తల్లిదండ్రులను ఆర్థిక భారం నుంచి కాపాడేందుకు కొంతవరకు ఈ పథకం మేలు చేస్తుంది. ఆడబిడ్డల ఉన్నత విద్యకు, వివాహానికి ఈ పథకం కొండంత అండగా ఉంటూ తల్లిదండ్రులకు, ఆడబిడ్డలకు భరోస కల్పిస్తుంది.