వనపర్తి: సమాజంలో అవినీతిని నిరోధించడమే తమ సంస్థ లక్షమని అవినీతి నిర్మూళన సంస్థ ఉమ్మడి జిల్లా చైర్మన్ అనూప్ చక్రవర్తి అన్నారు. వనపర్తి పట్టణ కేంద్రంలోని వల్లభ్‌నగర్ అవినీతి నిర్మూళన సంస్థ ఉమ్మడి జిల్లా చైర్మన్ అనూప్ చక్రవర్తి నివాసంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆల్ ఇండియా అవినీతి నిర్మూళన సంస్థ, ప్రైవేట్ సంస్థ కాదని కేంద్ర క్యాబినెట్ సమావేశంలో చర్చించి స్థాపించిన సంస్థ అని ఆయన తెలిపారు. దేశ వ్యాప్తంగా అవినీతిని నిరోధించేందుకు ఈ సంస్థ కృషి చేస్తుందన్నారు. ఉమ్మడి జిల్లాలో ఎలాంటి అవినీతి లేకుండా నిరోధించడమే తన ధ్యేయమని ఆయన తెలిపారు. అవినీతికి పాల్పడిన వారి సమాచారం తమకు అందజేయాలని ఆయన ఈ సెల్ 9703004004కు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. ఉమ్మడి జిల్లాలో 28 మంది సభ్యులచే కమిటి నియమింపబడ్డారని ఆయన తెలిపారు. దేశంలో అవినీతి నిర్మూలించేందుకు ఈ సంస్థ ప్రధాన లక్షమన్నారు. సమావేశంలో వైస్ చైర్మన్ పూర్ణచందర్‌గౌడ్, జిల్లా కార్యదర్శి నరసింహ్మ, డా. సుధా కర్, మీడియా కార్యదర్శి పి.రాము, ఉమ్మడి జిల్లా చైర్మన్ అనూప్ చక్రవర్తి సభ్యులకు నియామక పత్రాలు, గుర్తింపు కార్డులను అందజేశారు.
2ఃసభ్యులకు నియామక పత్రాలు అందజేస్తున్న చైర్మన్ అనూప్ చక్రవర్తి